క్షీరసాగర్ జెడ్పీహెచ్‌ఎస్‌లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు సన్మానం....

క్షీరసాగర్ జెడ్పీహెచ్‌ఎస్‌లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు సన్మానం....

ప్రజాస్వరం : గజ్వెల్ / ములుగు : జూన్ 22  : 

 

ములుగు మండలం క్షీరసాగర్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2026 సంవత్సరానికి సంబంధించిన 10వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి ప్రతిభ కనబర్చిన విద్యార్థులను ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా KMR చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కొన్యాల ఉమ నరసింహరెడ్డి, TEAM KNR సభ్యులు మరియు అంబేద్కర్ యూత్ కలిసి పాఠశాలలో ఫస్ట్ ర్యాంక్ సాధించిన కుందనపల్లి సిరిని ప్రత్యేకంగా సన్మానించి మెమెంటోతో పాటు నగదు బహుమతి అందజేశారు.అలాగే మొదటి ఐదు స్థానాల్లో నిలిచిన మరో ఐదుగురు విద్యార్థులకు కూడా నగదు బహుమతులు, మెమెంటోలు అందించి అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ భవిష్యత్తులో కూడా విద్యార్థులకు ప్రోత్సాహం అందిస్తూ, విద్యాభివృద్ధికి తమవంతు సహకారం అందిస్తామని తెలిపారు. స్థానికులు, తల్లిదండ్రులు మరియు పాఠశాల సిబ్బంది ఈ కార్యక్రమాన్ని అభినందించారు.