రేపటి నుంచే విత్తన మేళా.....

రేపటి నుంచే విత్తన మేళా.....

ప్రజాస్వరం : మనోహరాబాద్: జూన్ 22 :

 

ఈ నెల 23 నుంచి 30వ తేదీ వరకు మనోహరాబాద్ మండలంలోని అన్ని రైతు వేదికలలో విత్తన మేళా నిర్వహించనున్నట్లు మండల వ్యవసాయ శాఖ అధికారి స్రవంతి తెలిపారు. రైతులకు నాణ్యమైన విత్తనాలను ఒకేచోట అందుబాటులో ఉంచే ఉద్దేశంతో ఈ మేళాను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ విత్తన మేళాలో ప్రభుత్వం సూచించిన ఏడు సన్న రకాల వరి విత్తనాలు రైతులకు అందుబాటులో ఉంటాయని తెలిపారు. రైతులు తమ అవసరాలకు అనుగుణంగా నాణ్యమైన విత్తనాలను కొనుగోలు చేసుకునే అవకాశం కల్పించబడిందన్నారు. కావున మండలంలోని రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.