కంపెనీ అభివృద్ధే కార్మికుల అభివృద్ధికి బాట .....
ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి.....
టీసీపిఎల్ ఎంప్లాయిస్ యూనియన్ కు కొత్త నాయకత్వం....
మెదక్ జిల్లా, తూప్రాన్ మున్సిపల్ పరిధిలోని , బ్రాహ్మణపల్లి శివారులో గల టాటా కాఫీ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (టీసీపిఎల్) కంపెనీ కార్మిక సంఘం నూతన అధ్యక్షుడిగా కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా సోమవారం టీసిపీఎల్ ఎంప్లాయిస్ యూనియన్ , మేనేజ్మెంట్ ఘనంగా స్వాగతం పలికి సన్మానించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కామారెడ్డి ఎమ్మెల్యే, టీసీపిఎల్ ఎంప్లాయిస్ యూనియన్ ప్రెసిడెంట్ కాటిపల్లి వెంకటరమణారెడ్డి కంపెనీ ఎదురుగా ముందు బీఎంఎస్ జెండాను ఆవిష్కరించారు ఎమ్మెల్యే కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ... ఒక కుటుంబంలో భార్యాభర్తలు పరస్పర సహకారంతో ముందుకు సాగినట్లే కంపెనీ యాజమాన్యం, కార్మికులు కూడా ఐక్యంగా పనిచేస్తే సంస్థ అభివృద్ధి చెందడంతో పాటు కార్మికుల జీవితాలు కూడా మెరుగుపడతాయని ఆయన అన్నారు. కంపెనీ బాగుంటేనే కార్మికుల సంక్షేమం సాధ్యమవుతుందని, చిన్న చిన్న సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని వెంకటరమణ రెడ్డి సూచించారు.పరిశ్రమల అభివృద్ధి, కార్మికుల ఎదుగుదల ఒకదానికొకటి విడదీయరాని సంబంధం కలిగి ఉన్నాయనిఆయన పేర్కొన్నారు. యాజమాన్యం, కార్మికులు పరస్పరం లాగుడుదీతలకు దిగితే సమస్యలు జటిలమై ఇరువర్గాలకు నష్టం జరిగే ప్రమాదం ఉందన్నారు. కార్మిక నాయకుడిగా, యూనియన్ అధ్యక్షుడిగా కార్మికుల సమస్యల పరిష్కారంలో సమర్థవంతమైన మధ్యవర్తిత్వం నిర్వహించి న్యాయం జరిగేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే రెడ్డి హామీ ఇచ్చారు.రాజకీయాల్లో అవినీతికి తాను పూర్తిగా వ్యతిరేకమని, ప్రజల డబ్బును దుర్వినియోగం చేసే వారిని సహించనని స్పష్టం చేశారు. ప్రజల విశ్వాసంతో గత, ప్రస్తుత ముఖ్యమంత్రులపై విజయం సాధించిన ఎమ్మెల్యేగా తన బాధ్యతను ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటానని చెప్పారు. అవసర సమయంలో అండగా నిలబడటమే నిజమైన సేవ అని, కష్టకాలంలో ఇచ్చే ధైర్యం ఎన్నో కుటుంబాలకు బలాన్నిస్తుందని పేర్కొన్నారు.కార్మికునికి న్యాయం జరిగితే ఆ కుటుంబం అభివృద్ధి చెందుతుందని, తాను పదవిని ఆడంబరంగా, అలంకారంగా కాకుండా బాధ్యతగా భావించే వ్యక్తినని తెలిపారు. టీసీపిఎల్ మేనేజ్మెంట్, కార్మికులు సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతున్నందున సంస్థ మరింత అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయని అన్నారు. ఒక ఉద్యోగం పై అతని కుటుంబంలోని నల్గురు సభ్యుల జీవితం ఆధారపడి ఉంటుందని, అందుకే ప్రతి ఉద్యోగి సంక్షేమం సంస్థ పురోగతితో ముడిపడి ఉందన్నారు.ట్రేడ్ యూనియన్ వ్యవహారాలు తనకు కొత్త అయినప్పటికీ కేవలం రెండు నెలల్లోనే యూనియన్ చట్టాలు, నిబంధనలను అధ్యయనం చేసి కార్మికులు, యాజమాన్యం మధ్య వారధిగా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు. సంస్థలోని ప్రతి సమస్యను చర్చల ద్వారా పరిష్కరించి కార్మికులకు న్యాయం జరిగేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. టీసీపిఎల్ కార్మిక సంఘానికి నూతన నాయకత్వం లభించడం సంస్థలో కార్మిక-యాజమాన్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని, కార్మిక సంక్షేమంతో పాటు పరిశ్రమ అభివృద్ధికి ఇది దోహదపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీసీపిఎల్ సైట్ హెడ్ శివకుమార్, హెచ్.అర్ కోటేశ్వర రావు, క్వాలిటీ ఆఫీసర్ రాకేష్, ప్రొడక్షన్ మేనేజర్ సుధాకర్ రెడ్డి, మెయింటెనెన్స్ ఇన్‌చార్జి రంగనాయకులు, బీజేపీ రాష్ట్ర నాయకులు ఎం. గిరీష్ రెడ్డి, పార్లమెంట్ ఇన్‌చార్జి వర్గంటి రామ్‌మోహన్ గౌడ్, బిజెపి పట్టణ అధ్యక్షులు భూమన్నగారి జానకిరామ్ గౌడ్, మండల అధ్యక్షులు పిట్ల పోచయ్య ముదిరాజ్, పడాలపల్లి కౌన్సిలర్ సత్యనారాయణ, సంఖ్య యాదగిరి, రఘువీరారెడ్డి, వెంకట నాగేంద్ర గౌడ్, జక్కిడి నరేందర్ రెడ్డి (బుల్లెట్ రాజు), టాటా కంజుమర్ ప్రొడక్ట్ లిమిటెడ్ ఎంప్లాయిస్ యూనియన్ జనరల్ సెక్రెటరీ లంబ లవకుమార్ యాదవ్, జాయింట్ సెక్రెటరీ బొంది శ్రీనివాస్ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ జి. నర్సింగ్‌రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ వి. రఘుపతి రెడ్డి, టి. వీరప్రసన్న, ట్రెజరర్ బి. వెంకట్రావు, ఆర్గనైజింగ్ సెక్రటరీలు పి. ప్రవీణ్, జి. సత్యనారాయణ, వైస్ ప్రెసిడెంట్లు కే. దైవాదీనం, ఎల్. మహేష్ కుమార్, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు ఎం.రామశర్మ, కార్మిక నాయకులు, మహిళా కార్మికులు, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


