లద్దాక్ కు పోటెత్తున్న టూరిస్టులు.....
ప్రజాస్వరం : శ్రీనగర్ / హైదరాబాద్ : జూన్ 8 :
కాంప్లయన్స్ భారం తగ్గించి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ను ప్రోత్సహించాయిఈ సంస్కరణలు స్థానిక యువతకు మరిన్ని అవకాశాలు కల్పించాయి. హోమ్‌స్టేలు, ట్రాన్స్‌పోర్ట్, హ్యాండిక్రాఫ్ట్, ఫుడ్ అండ్ బెవరేజెస్ రంగాల్లో ఉపాధి పెరిగింది. మెరుగైన రోడ్డు కనెక్టివిటీ, ఎక్కువ విమాన సర్వీసులు, సోషల్ మీడియా ద్వారా లద్దాక్ సౌందర్యం వైరల్ కావడం, పోస్ట్–పాండమిక్ ట్రావెల్ బూమ్ ఈ సీజన్‌ను రికార్డు స్థాయికి తీసుకెళ్లాయి. ప్రత్యేకించి మే నెలలో రోడ్లు తెరవడం, అనుకూల వాతావరణం, పర్వతాలు, సరస్సులు, మఠాలు, అడ్వెంచర్ యాత్రలు కలిపి ఒక అద్భుతమైన అనుభవాన్ని అందిస్తున్నాయి. ఈ అపూర్వ వృద్ధి ఎంతో సంతోషాన్ని కలిగిస్తున్నప్పటికీ, లద్దాక్ పర్యావరణ సున్నితత్వాన్ని మరచిపోకూడదు. ఇప్పటికే పాపులర్ స్పాట్లైన పాంగాంగ్ లేక్, నుబ్రా వ్యాలీ, లే–మనాలి హైవేల్లో క్రౌడింగ్, వాస్తే మేనేజ్‌మెంట్, నీటి కొరత, వాహనాల నుంచి వచ్చే కాలుష్యం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. లద్దాక్ ఒక ఫ్రాజైల్ ఎకోసిస్టమ్. ఇక్కడ టూరిజం వృద్ధి చెందాలంటే అది సస్టైనబుల్, రెస్పాన్సిబుల్ టూరిజంగా మాత్రమే ఉండాలి. ప్రభుత్వం, స్థానికులు, టూరిజం స్టేక్‌హోల్డర్లు కలిసి పనిచేసి, క్యాపాసిటీ బిల్డింగ్, ఆఫ్–సీజన్ టూరిజం ప్రోత్సాహం, ఎకో–టూరిజం, వేస్ట్ మేనేజ్‌మెంట్, కార్బన్ ఫుట్‌ప్రింట్ తగ్గించడం వంటి వ్యూహాలను అమలు చేయాలి.లద్దాక్ టూరిజం ప్రస్తుతం చూస్తున్న ఈ బూమ్ ఒక అపూర్వ అవకాశం. సరైన ప్రణాళిక, స్థానికుల పాల్గొన్నత, పర్యావరణ సంరక్షణతో కూడిన విధానాలతో ఈ వృద్ధిని మరింత స్థిరంగా, అర్థవంతంగా మార్చుకోవాలి. లద్దాక్ కేవలం ఒక టూరిస్ట్ డెస్టినేషన్ కాదు.. ఇది ఒక ప్రత్యేకమైన జీవన విధానం, సంస్కృతి, ప్రకృతి. దానిని కాపాడుకుంటూ అభివృద్ధి చేయడమే నిజమైన విజయం.


