డాజిల్ క్లాత్ స్టోర్ ను ప్రారంభించిన ఎంపీ ఈటెల,ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి...
By Prajaswaram
On
ప్రజాస్వరం : మేడ్చల్ : జూన్ 28 :
మేడ్చల్ పట్టణంలోని జాతీయ రహదారి 44కు అనుకొని కెఎఫ్ సి పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన డాజిల్ క్లాత్ స్టోర్ ను ఎంపీ ఈటెల, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి లు ముఖ్య అతిథిలుగా హాజరై ఆదివారం ప్రారంభించారు.ఈ సందర్భంగా నిర్వాహకులు ఎంపీ ఈటెల కు, ఎమ్మెల్యే మల్లారెడ్డికి శాలువా కప్పి ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.అనంతరం క్లాత్ స్టోర్ నిర్వాహకులు క్రాంతి కుమార్ మాట్లాడుతూ తక్కువ ధరల్లో వినియోగదారులకు నాణ్యమైన బట్టలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.అన్ని రకాల నాణ్యమైన బ్రాండ్ లు ఈ షోరూంలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు.ఈ షో రూమ్ లో షార్ట్స్,టీ షార్ట్స్, జాగింగ్,వాకింగ్,ఫార్మల్ బట్టలతో పాటుగా లేటెస్ట్ కలెక్షన్ అందుబాటులో ఉంటుందని తెలియజేశారు.రూ.199 నుండి మొదలై రూ.1300ల వరకు రేట్లు ఉన్నాయని వివరించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ బీఆర్ఎస్ అధ్యక్షుడు భాస్కర్ యాదవ్, మాజీ కో ఆప్షన్ సభ్యుడు అకిటి నవీన్ రెడ్డి,ఎల్లంపేట మున్సిపల్ చైర్ పర్సన్ లావుడ్య శ్రీదేవి,కౌన్సిలర్ సద్ది నిషిత రెడ్డి,మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ దామన్నగారి ప్రభాకర్,నాయకులు నడికొప్పు నాగరాజు,శైలేందర్,మండల రవి,వంగేటి రాజి రెడ్డి,సద్ది సుశాంత్ రెడ్డి,విఠల్,రాజు నాయక్,శ్రీనివాస్ రెడ్డి, నిర్వాహకులు,తదితరులు పాల్గొన్నారు.
Latest News
28 Jun 2026 22:13:08
ప్రజాస్వరం : తూప్రాన్ : జూన్ 28 : పేకాట ఆదుతున్నారని నమ్మదగిన సమాచారంతో పేకాట స్థావరం పై పోలీస్ లు దాడి చేసిన ఘటన చోటుచేసుకుంది.శివంపేట...


