జర్నలిస్ట్ పై దాడి హెయమైన చర్య .....  

జర్నలిస్ట్ పై దాడి హెయమైన చర్య .....   

నిందితులను వెంటనే అరెస్ట్ చెయ్యాలి...

ప్రజాస్వరం : మనోహరాబాద్ : జూన్ 23 :

 

ప్రభుత్వ స్థలంలో అక్రమంగా ఏర్పాటు చేసిన నిర్మాణాలపై గ్రామ పంచాయతీ నోటీసులు జారీ చేసిన వార్త ప్రచురించిన విలేకరి పై సోమవారం జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు టియుడబ్ల్యుజే (ఐజేయు) జిల్లా కార్యవర్గం సభ్యులు రామాచారి,చందు గౌడ్ పేర్కొన్నారు. జిల్లా టియూడబ్యూజే(ఐజేయూ) పిలుపు మేరకు దాడికి నిరసనగా మనోహరాబాద్ మండల తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం వినతిపత్రం అందచేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పత్రికా స్వేచ్ఛను హరిస్తూ నిజాలు నిగ్గు తేల్చిన జర్నలిస్టులపై దాడులు చేయడం హేయమైన చర్య అన్నారు. దాడికి పాల్పడిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమం లో ప్రెస్ క్లబ్ నాయకులు శివకృష్ణ, రమేష్, శ్రీనివాస్, శ్రీకాంత్, నర్సింహా, శ్రావణ్, మహేష్, శివ,నరేష్,ప్రవీణ్, సత్యం తదితరులు ఉన్నారు.