ఉద్యమకారుల భూమి పోరాటాన్ని విజయవంతం చేయాలి..

ఇంచార్జి వేముల భవాని.....

ఉద్యమకారుల భూమి పోరాటాన్ని విజయవంతం చేయాలి..

ప్రజాస్వరం : మెదక్, జూన్ 23  : 

 

మెదక్ పట్టణంలోని టీఎన్జీఓ భవనంలో తెలంగాణ రక్షణ సేన (బీఆర్ఎస్) పార్టీ ఆధ్వర్యంలో జూలై 2న హైదరాబాద్‌ లో నిర్వహించనున్న "ఉద్యమకారుల భూమి పోరాటం" కార్యక్రమానికి సంబంధించిన గోడపత్రికను మంగళవారం పార్టీ నాయకులు ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర స్థాయి నాయకురాలు, మెదక్ జిల్లా ఉద్యమకారుల ఇంచార్జి వేముల భవాని, మెదక్ జిల్లా బీఆర్ఎస్ ఇంచార్జి పీ. చంద్రశేఖర్ పాల్గొని మాట్లాడారు. ఉద్యమకారుల హక్కుల సాధన కోసం చేపడుతున్న ఉద్యమకారుల భూమి పోరాటం కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రతి ఉద్యమకారుడి పై ఉందని అన్నారు. జూలై 2న హైదరాబాద్‌ లో జరిగే కార్యక్రమానికి ఉద్యమకారులు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకురాలు కవిత, నర్సాపూర్ టీఆర్ఎస్ నాయకురాలు అపర్ణ, మెదక్ నియోజకవర్గ ఇంచార్జి బట్టి అజయ్, రమేష్ గౌడ్, మెదక్ పట్టణ నాయకులు భాను, అశోక్, నవీన్, గొండ, నెల్లి రాజు, యోహాన్‌తో పాటు పార్టీ నాయకులు, ఉద్యమకారులు తదితరులు పాల్గొన్నారు.