జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధి జరగాలి...
జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ...
By Prajaswaram
On
ప్రజాస్వరం : మెదక్ జిల్లా : మనోహరబాద్ : జూన్ 23 :
జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధి జరగాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు.మంగళవారం ,మనోహరాబాద్ మండలంలోని శాంత బయోటెక్ పరిశ్రమలో జిల్లా పారిశ్రామిల అభివృద్ధి పై సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ...జిల్లాలు పారిశ్రామిక అభివృద్ధి జరిగి పరిశ్రమల స్థాపన, ఉద్యోగ అవకాశాల కల్పన కోసం చొరవ చూపాలన్నారు.పరిశ్రమలలో సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడంతో పాటు ప్రభుత్వ సబ్సిడీలు, ప్రోత్సాహక పథకాలు అర్హులైన లబ్ధిదారులకు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.జిల్లాలోని నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కోసం నూతన యాప్ శిక్షణను పారిశ్రామిక వేతలకు జరిగింది పారిశ్రామికవేత్తలు చాలా ఉత్సాహంతో వారి సందేహాలు నివృత్తి చేసుకోవడం జరిగింది.కార్యక్రమం అంతరం శాంత బయోటెక్ పరిశ్రమలలో మొక్కలు నాటి, వాటికి నీరు పోశారు.ఈ కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల జనరల్ మేనేజర్ ప్రకాష్ రావు,ఐల అధ్యక్షులు సుబ్బారావు , కార్యదర్శి, అసోసియేషన్ సభ్యులు మరియు వివిధ పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.
Latest News
23 Jun 2026 19:32:37
ప్రజాస్వరం : మెదక్, జూన్ 23 : మెదక్ పట్టణంలోని టీఎన్జీఓ భవనంలో తెలంగాణ రక్షణ సేన (బీఆర్ఎస్) పార్టీ ఆధ్వర్యంలో జూలై 2న హైదరాబాద్ లో...


