దమ్ముంటే అసెంబ్లీ రద్దు చేయాలి .....

హరీష్ రావు......

దమ్ముంటే అసెంబ్లీ రద్దు చేయాలి .....

గెలుస్తామని నమ్మకముంటే ఎన్నికలకు వెళ్దాం...

సీఎం రేవంత్ కు హరీష్ రావు సవాల్....

ప్రజాస్వరం : సిద్దిపేట / మెదక్ : జూన్ 28 :

కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను పట్టించుకోవడంలేదని భరోసా ఇచ్చి రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఇప్పటికి మూడుసార్లు ఎగ్గొట్టిందని మండిపడ్డారు. 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన ఘనత కాంగ్రెస్కే దక్కిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గెలుస్తామని నమ్మకం ఉంటే అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు వెళ్దామని సవాల్ విసిరారు. ప్రభుత్వ హామీలను ప్రశ్నిస్తే వ్యక్తిగత విమర్శలు చేస్తున్నాడని మండిపడ్డారు. ఇచ్చిన హామీలపై రైతుబంధు ఎగ్గొట్టిన విషయంతో పాటు సింగరేణి టెండర్ వంటి విషయాలపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రత్యేక అసెంబ్లీని ఏర్పాటు చేస్తే మేము చర్చకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. హరీష్ రావు సవాల్ సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా తీసుకుంటుందో చూద్దాం.