పోలియో రహిత సమాజ నిర్మాణానికి అందరూ సహకరించాలి....

మున్సిపల్ వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్....

పోలియో రహిత సమాజ నిర్మాణానికి అందరూ సహకరించాలి....

ప్రజాస్వరం : మెదక్ : జూన్ 28  :

 

మెదక్ పట్టణంలోని 14 వ వార్డు లో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్ పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.  ఈ సందర్భంగా దొంతి నరేష్ గౌడ్ మాట్లాడుతూ ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు సూచించారు. పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రజలందరూ సహకరించాలని, ఒక్క చిన్నారిని కూడా పోలియో చుక్కలకు దూరం చేయొద్దని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.