ప్రతి ఐదేళ్ల లోపు చిన్నారికి తప్పని సరిగా పోలియో చుక్కలు వేయించాలి....

జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్...

ప్రతి ఐదేళ్ల లోపు చిన్నారికి తప్పని సరిగా పోలియో చుక్కలు వేయించాలి....

పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి... 

 

ప్రజాస్వరం : మెదక్ : జూన్ 28 :

 

ప్రతి ఐదేళ్ల లోపు చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. జాతీయ ఆరోగ్య మిషన్ కింద పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఆదివారం మెదక్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన పల్స్ పోలియో చుక్కల కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ముఖ్య అతిథిగా హాజరై, ప్రారంభించారు. ఈ సందర్భంగా 0 నుంచి 5 సంవత్సరాల లోపు చిన్నారులకు స్వయంగా కలెక్టర్ పోలియో చుక్కలు వేశారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పోలియో రహిత సమాజ నిర్మాణంలో పల్స్ పోలియో కార్యక్రమం అత్యంత కీలకమైందన్నారు. ప్రతి ఐదేళ్ల లోపు చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించడం అత్యంత అవసరమని పేర్కొన్నారు. జిల్లాలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రతి కుటుంబం తమ చిన్నారులను సమీపంలోని పోలియో కేంద్రాలకు తీసుకువచ్చి పోలియో చుక్కలు వేయించాలని కోరారు. ఏ ఒక్క చిన్నారి కూడా ఈ కార్యక్రమానికి దూరం కాకుండా అధికారులు, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. పోలియో చుక్కలు చిన్నారుల ఆరోగ్య రక్షణకు సురక్షితమైనవి, అత్యంత ప్రభావవంతమైనవని తెలిపారు. జిల్లాలో ఏర్పాటు చేసిన అన్ని పోలియో కేంద్రాల్లో అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. కేంద్రాలకు రాలేని చిన్నారులకు ఇంటింటికీ వెళ్లి పోలియో చుక్కలు వేసేలా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రతి చిన్నారి పోలియో చుక్కలు తీసుకునే వరకు అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచో గణేశ్వర్, మున్సిపల్ వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్  ఇతర సంబంధిత వైద్యాధికారులు, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.