ఓటర్ల జాబితా సవరణ పై 14,15 వ వార్డులో అవగాహన....
వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్...
By Prajaswaram
On
ప్రజాస్వరం : మెదక్ : జూన్ 27 :
ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా శనివారం మెదక్ పట్టణంలోని 14, 15 వ వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (సర్) ప్రక్రియ లో మున్సిపల్ వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్, 14 వ వార్డు కౌన్సిలర్ దొంతి లక్ష్మీ ముత్యం గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల కమిషన్ నియమించిన బీఎల్ఓ లతో కలిసి ఇంటింటికీ తిరుగుతూ ఓటర్ల కు అవగాహన కల్పించారు. భారత రాజ్యాంగం ప్రకారం "ఒక వ్యక్తి కి ఒకే ఓటు" అనే నినాదంతో ఓటర్ల జాబితాలో పారదర్శకత ఉండాలని తెలిపారు. అర్హులైన ఏ ఒక్కరి ఓటు కూడా అన్యాయంగా తొలగించబడకుండా చూడాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Latest News
27 Jun 2026 19:27:00
ప్రజాస్వరం : మేడ్చల్ : జూన్ 27 : రోడ్డు ఆక్రమణలపై అధికారులు కొరఢా ఝళిపించారు.రోడ్డు స్థలాన్ని ఆక్రమించి రోడ్డును ఆనుకుని ఎలాంటి అనుమతులు లేకుండా మేడ్చల్...


