పేకాట స్థావరంపై పోలీసుల దాడి.....

జిల్లా ఎస్పీ డి. వి. శ్రీనివాస రావు...

పేకాట స్థావరంపై పోలీసుల దాడి.....

ఐదుగురు అరెస్టు..11,230 నగదు, ఐదు ఫోన్లు స్వాధీనం....

 

ప్రజాస్వరం : మెదక్ : జూన్ 27  : 

 

శివ్వంపేట మండలం గంగాయిపల్లి గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో పేకాట ఆడుతున్న ఐదుగురిని మెదక్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు శనివారం దాడి నిర్వహించిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టైన వారిలో ఇటిక్యాల రేవంత్ రెడ్డి, బానోత్ కంద్యా, నల్ల పేరమాన్లు, జిట్ట సత్యనారాయణ, ఎ. ప్రశాంత్ ఉన్నారు. వారి వద్ద నుంచి రూ.11,230 నగదుతో పాటు ఐదు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు మాట్లాడుతూ జిల్లాలో జూదం, పేకాట వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలపై నిరంతర నిఘా కొనసాగుతోందని తెలిపారు. శాంతి భద్రతలకు భంగం కలిగించే ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు తమ పరిసరాల్లో జరిగే అక్రమ కార్యకలాపాలపై పోలీసులకు సమాచారం అందించి సహకరించాలని కోరారు.