తూప్రాన్ గురుకుల బాలుర పాఠశాల కు స్పెషల్ అఫీసర్ గా శ్రీకాంత్ ....
By Prajaswaram
On
ప్రజాస్వరం : తూప్రాన్ : జూన్ 27 :
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల పాఠశాలలకు ప్రత్యేక అధికారులను నియమించారు అందులో భాగంగా తూప్రాన్ టోల్ ప్లాజా వద్ద గల అల్లాపూర్ శివారులో గల తెలంగాణ బాలుర గురుకుల జూనియర్ కళాశాల మరియు పాఠశాల కు తూప్రాన్ డైప్యూటీ తహసీల్దార్ శ్రీకాంత్ ను నియమిస్తూ జిల్లా కలెక్టర్ ప్రతిమ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు.. వెంటనే తూప్రాన్ (అల్లాపూర్)లోని పీఎం శ్రీ టీజీఆర్జేసీ (PM SHRI TGRJC - బాలుర) గురుకుల పాఠశాలను శనివారం ప్రత్యేక అధికారి ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. ఈ సందర్శనలో భాగంగా పాఠశాల ప్రాంగణం, వంటగది (కిచెన్), మరియు స్టాక్ రూమ్‌లన ప్రత్యేక అధికారి శ్రీకాంత్ నిశితంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి గా .. తనిఖీలో ఎలాంటి పెద్ద లోపాలు కనిపించలేదు, ప్రాంగణం సంతృప్తికరంగా ఉంది. అయితే, రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని, కాలానుగుణ వ్యాధులు ప్రబలకుండా సిబ్బంది అంతా అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించడం జరిగింది. ,విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా వంటగది, పరిసరాలను నిరంతరం పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నాణ్యమైన ఆహారాన్ని అందించాలని పాఠశాల సిబ్బందికి స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసిన స్పెషల్ అఫీసర్.
Latest News
27 Jun 2026 19:27:00
ప్రజాస్వరం : మేడ్చల్ : జూన్ 27 : రోడ్డు ఆక్రమణలపై అధికారులు కొరఢా ఝళిపించారు.రోడ్డు స్థలాన్ని ఆక్రమించి రోడ్డును ఆనుకుని ఎలాంటి అనుమతులు లేకుండా మేడ్చల్...


