కంఠరెడ్డి తిరుపతి రెడ్డిని కలిసిన బీఆర్ఎస్ కౌన్సిలర్లు...

కంఠరెడ్డి తిరుపతి రెడ్డిని కలిసిన బీఆర్ఎస్ కౌన్సిలర్లు...

ప్రజాస్వరం : మెదక్ : జూన్ 24 : 

 

మెదక్ జిల్లా బీఆర్ఎస్ నాయకుడు కంఠరెడ్డి తిరుపతి రెడ్డి ని పార్టీ మున్సిపల్ కౌన్సిలర్లు బట్టి ఉదయ్, దీపక్ కుమార్, జుబేర్ మహమ్మద్ సోహెల్, మాజీ కౌన్సిలర్ మాయ మల్లేశం, నాయకుడు ఇందాద్ సాయి ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కంఠరెడ్డి తిరుపతి రెడ్డి మాట్లాడుతూ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు సూచనలు, సలహాల మేరకు మెదక్‌లో బీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే పార్టీకి వెన్నెముక అని పేర్కొన్న ఆయన, నాయకులు, కౌన్సిలర్ల కు ఎలాంటి అవసరం వచ్చినా తన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని హామీ ఇచ్చారు. పార్టీ శ్రేణుల సంక్షేమం, సంస్థాగత బలోపేతం కోసం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతామని తెలిపారు. పార్టీ శ్రేణులు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కౌన్సిలర్ల కు సూచించారు. అనంతరం కౌన్సిలర్లు, నాయకులను శాలువాతో ఘనంగా సన్మానించారు.