కుల మతాలకు అతీతంగా జరుపుకునే పండుగ మొహరం ....
18 వ వార్డు మాజీ కౌన్సిలర్ భవాని రాఘవేందర్ గౌడ్....
By Prajaswaram
On
ప్రజాస్వరం : మేడ్చల్ : జూన్ 26 :
మేడ్చల్ పట్టణంలో నిర్వహించిన ఫీర్ల పండుగ వేడుకలలో 18 వ వార్డు మాజీ కౌన్సిలర్ భవాని రాఘవేందర్ గౌడ్ కుటుంబ సమేతంగా పాల్గొని దట్టి సమర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హిందూ,ముస్లింలు అందరూ కలిసి మత సామరస్యంతో జరుపుకునే పండుగ మొహరం పండుగ అని పేర్కొన్నారు.ఎప్పుడూ అందరూ సోదర భావంతో కుల,మతాలకతీతంగా పండుగ జరుపుకోవాలని పిలుపునిచ్చారు.అందరూ కలిసి మెలిసి మొహరం పండుగ జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు.ఫీర్ల పండుగ సందర్భంగా ప్రజలందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో మొహరం పండుగనీ జరుపుకుంటున్నారని వారందరికీ మొహరం పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Latest News
26 Jun 2026 17:22:34
ప్రజాస్వరం : మేడ్చల్ : జూన్ 26 : మేడ్చల్ పట్టణంలో నిర్వహించిన ఫీర్ల పండుగ వేడుకలలో 18 వ వార్డు మాజీ కౌన్సిలర్ భవాని రాఘవేందర్...


