జర్నలిస్ట్ కాలనీలో సీసీ రోడ్డు పనులను పరిశీలించిన మున్సిపల్ వైస్ చైర్మన్....

జర్నలిస్ట్ కాలనీలో సీసీ రోడ్డు పనులను పరిశీలించిన మున్సిపల్ వైస్ చైర్మన్....

ప్రజాస్వరం : మెదక్ : జూన్ 28  : 

 

మెదక్ పట్టణంలోని జర్నలిస్ట్ కాలనీలో ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ రావు ఇటీవల ప్రారంభించిన సీసీ రోడ్డు నిర్మాణ పనులను మున్సిపల్ వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్ శనివారం జర్నలిస్టులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించిన ఆయన, జర్నలిస్టుల సమస్యలను అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. జర్నలిస్టుల కాలనీలో మౌలిక సదుపాయాల కల్పన కు మున్సిపాలిటీ తరఫున అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు శంకర్ దయాల్ చారి, కమాటి కృష్ణ, సంగమేశ్వర్, ఉషయ్య, ఆంజనేయులు, ఫణి, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.