మీడియా పై ఆంక్షలతో కౌన్సిలర్ల ఆగ్రహం....
నా పేరు జుబేర్ అహ్మద్ మేడం....
మీడియా పై ఆంక్షలు, అభివృద్ధి పనులపై కౌన్సిలర్ల ఆగ్రహం...
ప్రజాస్వరం ,మెదక్, జూన్ 30 :
మెదక్ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్‌పర్సన్ రాధిక అధ్యక్షతన నిర్వహించిన సాధారణ సర్వసభ్య సమావేశంలో మీడియా పై ఆంక్షలు, అభివృద్ధి పనులు, వార్డుల సమస్యలు ప్రధాన చర్చనీయాంశాలయ్యాయి. ముందుగా నూతన మున్సిపల్ కమిషనర్ నవీన్ కౌన్సిలర్స్ ను శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఈ సమావేశంలో పలువురు కౌన్సిలర్లు తమ వార్డుల సమస్యలను ప్రస్తావిస్తూ అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. 9వ వార్డు కౌన్సిలర్ జుబేర్ అహ్మద్ మాట్లాడుతూ సమావేశంలో మీడియా ప్రతినిధులు ఫోటోలు, వీడియోలు తీయవద్దని చెప్పడం వారి హక్కులను హరించడమేనని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో చైర్‌పర్సన్ రాధిక తన పేరును పొరపాటున "షమీ"గా సంబోధించగా, "నా పేరు జుబేర్ మేడం" అని ఆయన సరిదిద్దారు. కౌన్సిలర్ పేరు గుర్తు లేకపోవడంపై సమావేశంలో చర్చ జరిగింది.29 వ వార్డు కౌన్సిలర్ బట్టి ఉదయ్ మాట్లాడుతూ మీడియాపై ఆంక్షలు విధించడం సమంజసం కాదన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించే సమావేశాల్లో వీడియోలు తీయడానికి మీడియాకు అనుమతి ఇవ్వాలని కోరారు. తమ వార్డులో నీటి సమస్య పరిష్కారానికి అమృత్ పథకం నిధులను వినియోగించాలని సూచించారు. వార్డు సమస్యలపై మాట్లాడానికి కమిషనర్ కు ఫోన్ చేస్తే కనీసం స్పందించక పోవడం విడ్డూరంగా ఉందన్నారు. మున్సిపాలిటీలో ఏం జరుగుతుందో చైర్మన్ కు, అధికారులకు తెలియకపోవడం గా విడ్డూరంగా ఉందన్నారు. మున్సిపాలిటీకి సొంత జేసీబీ ఉన్నప్పటికీ ప్రైవేట్ జేసీబీ కి 2 లక్షలు ఖర్చు చేశారని ఆరోపించారు. అలాగే పంచర్ మరమ్మతులకు 40 వేల, ఈ నెల 20 వేలు ఖర్చు చేయడాన్ని చూస్తూ కౌన్సిలర్ కంటే పంచర్ షాప్ పెట్టుకున్నది బెటర్ అని వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు.22 వ వార్డు కౌన్సిలర్ గౌస్ ఖురేషి మాట్లాడుతూ గత సమావేశంలో తమ వార్డును పరిశీలిస్తామని చెప్పిన చైర్‌పర్సన్, కమిషనర్ ఇప్పటి వరకు రాలేదన్నారు. వర్షాకాలంలో తమ వార్డులోని చమన్ ప్రాంతంలో చిన్న వర్షానికే మోకాలి లోతు వరకు నీరు నిలుస్తోందని, వెంటనే శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. బోనాల సందర్భంగా అన్ని బ్యానర్లు తొలగించి ఒక బ్యానర్ మాత్రమే ఉంచడం సరైంది కాదన్నారు. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి, పారిశుద్ధ్యం పై దృష్టి సారించాలని సూచించారు.19 వ వార్డు గంట సంపత్ మాట్లాడుతూ వార్డులోని గాంధీనగర్ లో తాగునీటి సమస్య ను పరిష్కరించాలని, పలు చోట్ల డ్రైన్స్, సీసీ రోడ్డు సమస్య ను పరిష్కరించాలని కోరారు. వార్డులో వీధి దీపాల పాడితే నా సొంత నిధులతో వీధి దీపాలు తీసుకుని వచ్చిన వాటిని బిగించేందుకు మున్సిపల్ సిబ్బంది సహకరించడం లేదన్నారు. ప్రభుత్వం నిధులతో నూతనంగా చర్చ్ ప్రాంగణంలో వేసిన సీసీ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, వాటి పరిష్కారం కోసం స్పీడ్ బ్రేక్ ఏర్పాటు చేయాలని కోరారు. రానున్న వర్షాకాలంలో దృశ్య వార్డుల వారిగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని కోరారు. చర్చ్ అద్దె గదుల్లో ఉంచిన ఇందిరమ్మ చీరలను అద్దె కట్టుకున్న సరే కానీ ఎలుకలు కొట్టక ముందే లబ్దిదారులకు పంపిణీ చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నవీన్, కౌన్సిలర్స్, మున్సిపల్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


