మెరుగైన పరిపాలన కోసం పీజేఆర్ ఎన్క్లేవ్ ప్రత్యేక డివిజన్..
మాజీ చైర్మన్ పాండురంగారెడ్డి
అమీన్ పూర్, జనవరి 31(ప్రజాస్వరం):
మెరుగైన పరిపాలన, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల సమర్థ అమలుకోసం అమీన్ పూర్ సర్కిల్ పరిధిలో పీజేఆర్ ఎన్క్లేవ్‌ను ప్రత్యేక డివిజన్‌గా ఏర్పాటు చేయాలని అమీన్ పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అమీన్ పూర్ సర్కిల్ పరిధిలోని మాధవపురి హిల్స్, జనప్రియ నైల్ వ్యాలీ, ఆర్టీసీ సువర్ణ వ్యాలీ, హెచ్ఎంటీ, వేదిరి, శిల్ప కాలనీలు కలుపుకొని నూతన డివిజన్ ఏర్పాటు చేయాలని కోరుతూ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన దీక్షను ఆయన సందర్శించి సంపూర్ణ మద్దతు తెలిపారు.
ప్రస్తుతం ఉన్న వ్యవస్థతో ప్రజలకు సమర్థవంతమైన పరిపాలన అందించడం సాధ్యం కాదని ఆయన పేర్కొన్నారు. ప్రజల సౌకర్యార్థం కిష్టారెడ్డి పేట మరియు పీజేఆర్ ఎన్క్లేవ్ పేర్లతో నూతనంగా రెండు డివిజన్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, మాజీ ఎంపీపీ దేవానందం, మాజీ జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, స్థానిక మాజీ కౌన్సిలర్లు మహాదేవ్ రెడ్డి, కృష్ణ, కల్పన, ఉపేందర్ రెడ్డితో పాటు సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


