డివిజన్ల అభివృద్ధికి సంపూర్ణ సహకారం..

ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి 

డివిజన్ల అభివృద్ధికి సంపూర్ణ సహకారం..

అమీన్ పూర్, జనవరి 31(ప్రజాస్వరం):

అమీన్ పూర్ సర్కిల్ పరిధిలో నూతనంగా ఏర్పడిన అమీన్ పూర్, బీరంగూడ డివిజన్ల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్నామని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. బీరంగూడ డివిజన్ పరిధిలోని శ్రీ కృష్ణా నగర్ కాలనీలో నూతనంగా నిర్మించిన కాలనీ ముఖద్వారాన్ని ప్రారంభించిన శనివారం ఎమ్మెల్యే జిఎంఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఇందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తూ నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. ప్రజల సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు కాలనీ ముఖద్వారం నిర్మించేందుకు సంపూర్ణ సహకారం అందించిన దాసు యాదవ్ ను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో 

అమీన్పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, మాజీ ఎంపీపీ దేవానందం, మాజీ జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ నందారం నరసింహా గౌడ్, మాజీ ప్రజా ప్రతినిధులు సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Latest News

ఆదిలాబాద్‌లోనే యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి.... ఆదిలాబాద్‌లోనే యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి....
ఆదిలాబాద్ , జనవరి 31(ప్రజాస్వరం): ఆదిలాబాద్ జిల్లా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని, ప్రభుత్వం ప్రతిపాదించిన యూనివర్సిటీని నిర్మల్ జిల్లాలో కాకుండా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోనే ఏర్పాటు...
పిప్పిరి గ్రామంలో రైతు ఫార్మర్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం..
మెరుగైన పరిపాలన కోసం పీజేఆర్ ఎన్క్లేవ్ ప్రత్యేక డివిజన్..
దేవాలయ వార్షికోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్...
జిహెచ్ఎంసి ప్రత్యేక డ్రైవ్..
డివిజన్ల అభివృద్ధికి సంపూర్ణ సహకారం..
సీఎం సహాయ నిధి చెక్కు పంపిణీ...