సీఎం సహాయ నిధి చెక్కు పంపిణీ...
By Prajaswaram
On
దౌల్తాబాద్, జనవరి 31(ప్రజాస్వరం):
మండల పరిధిలోని గాజులపల్లి గ్రామానికి చెందిన మారుపాక శ్రావణి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా శనివారం స్థానిక సర్పంచ్ పంజా స్వామి ఆమెకు రూ.17,000ల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును అందజేశారు.
అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అనారోగ్య సమస్యలతో కార్పొరేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన ప్రతి ఒక్కరు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద దరఖాస్తు చేసుకుంటే ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం లభిస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పంజా హరీష్, దాసరి నరేష్, పాశం నర్సింలు, బోయిని కనకయ్య, పంజ నర్సింలు, గాడి నర్సింలు, సత్తయ్య, పడిన వేణు, గాడిపల్లి ప్రశాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Latest News
31 Jan 2026 17:07:10
ఆదిలాబాద్ , జనవరి 31(ప్రజాస్వరం): ఆదిలాబాద్ జిల్లా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని, ప్రభుత్వం ప్రతిపాదించిన యూనివర్సిటీని నిర్మల్ జిల్లాలో కాకుండా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోనే ఏర్పాటు...


