పిప్పిరి గ్రామంలో రైతు ఫార్మర్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం..

పిప్పిరి గ్రామంలో రైతు ఫార్మర్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం..

ఆదిలాబాద్ జిల్లా, జనవరి 31 (ప్రజాస్వరం) :

 

ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండల పరిధిలోని రైతు వేదిక పిప్రి నందు రైతుల కోసం ఫార్మర్ రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టా పాసుబుక్ కలిగిన ప్రతి రైతు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అధికారులు సూచించారు.

ఆధార్ కార్డు తరహాలోనే ప్రతి రైతుకు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకుంటే 11 అంకెల రైతు ఐడి నంబర్ జారీ చేయబడుతుందని తెలిపారు. ఈ రైతు ఐడీ వ్యవసాయానికి సంబంధించిన కేంద్ర ప్రభుత్వ పథకాలైన పీఎం కిసాన్, పంట బీమా పథకం తదితర అన్ని స్కీములకు ప్రామాణికంగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి రైతులు పట్టాదార్ పాసుబుక్, ఆధార్ కార్డు మరియు ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నంబర్ తప్పనిసరిగా తీసుకురావాలని తెలిపారు. సమీపంలోని వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈఓ) ద్వారా రైతు వేదికలో ఉచితంగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చని, లేకపోతే మీసేవ కేంద్రంలో రూ.15 ఫీజుతో రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చని వివరించారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి క్రిష్ణపాల్‌తో పాటు రైతులు కిరణ్, మడవి లక్ష్మణ్ చంద్రశేఖర్, సోనాబాయి, కోసుబాయి తదితరులు పాల్గొqన్నారు.