నూతన ఎస్సీ కార్పొరేషన్ దుకాణాలను నిర్మించాలి...
రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ....
ఎస్సీ, ఎస్టీల కేసులలో అలసత్వం చేస్తే సహించం.....
మెదక్, ఫిబ్రవరి 26(ప్రజాస్వరం):
ఎస్సీ ఎస్టీలపై తప్పుడు కేసులు నమోదు చేయడం తగదని ,ఎస్సీ, ఎస్టీల కేసులలో అలసత్వం వహిస్తే చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అధికారులకు సూచించారు. శనివారం మెదక్ జిల్లా కలెక్టరేట్ లో జరిగిన సమీక్ష సమావేశంలో చైర్మన్ బక్కి వెంకటయ్య మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీలపై దాడులు జరిగితే అరికట్టలన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల పై అలసత్వం వద్దని సూచించారు. నర్సాపూర్ పెద్ద చింతకుంట గిరిజనులపై జరిగిన దాడి కేసు విచారణలో ఐవోలు మార్చాలని చైర్మన్ ఎస్పీని ఆదేశించారు. జిల్లా కేంద్రంలో అంబేద్కర్ భవనానికి మార్చి 26 వరకు స్థలానికి కేటాయించి భవన నిర్మాణం ప్రారంభించాలని ఆర్డీవో ను ఆదేశించారు. హవేలి ఘనపూర్ తదితర గ్రామాలలో నెలకొన్న భూమి సమస్యలను 45 రోజులలో పరిష్కరించాలని ఆదేశించారు. నరసాపూర్ మండలం మమతాబాద్ లోని గిరిజన ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేసి వసతులపై నాణ్యమైన భోజనం పై ఎస్సీ, ఎస్టీ కమిషన్కు నివేదిక సమర్పించాలని జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని ఆదేశించారు. బాధితులకు నష్ట పరిహారము అందించడంలో నిర్లక్ష్యాన్ని విడనాడాలన్నారు.
ఎస్సీ ఎస్టీ బాధితులకు ప్రారంభం కింద డబుల్ బెడ్ రూమ్ లను కేటాయించాలని చైర్మన్ ఆదేశించారు. హత్య అత్యాచారం సాంఘిక విష్కరణ తదితర కేసులలో బాధితులకు పక్క ఇండ్లను అందించాలని కోరారు. చరిత్రలోనే రాష్ట్రా ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఆధ్వర్యంలో సైబరాబాద్ మల్కాజ్గిరి హైదరాబాద్ జిల్లాలలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ బాధితులకు డబుల్ బెడ్ రూమ్లను పంపిణీ చేశామని తెలిపారు.
వివిధ శాఖ లు అమలు చేస్తున్న పథకాలపై సమీక్ష నిర్వహించారు. మెదక్ పట్టణంలోని ఎస్సీ కార్పొరేషన్ నూతన దుకాణాల సముదాయాలను తక్షణమే నిర్మాణాలను ప్రారంభించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు రాంబాబు నాయక్ జిల్లా అడిషనల్ కలెక్టర్ నగేష్ జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు, షెడ్యూలు కులాల అభివృద్ధి అధికారి విజయలక్ష్మి, గిరిజన అభివృద్ధి అధికారి నీలిమ, ట్రైన్ అధికారి సింధు,డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి శంకర్ తదిత దళిత సంఘాల నాయకులు డివిఎంసి సభ్యులు పాల్గొన్నారు.


