సాయి పేట శ్రీనివాస్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు
విజేతలకు బహుమతులు అందజేసిన శ్రీనివాస్
మేడ్చల్ (ప్రజాస్వరం) :
గుండ్లపోచంపల్లి 299 డివిజన్ లో సంక్రాతి పండగ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాయిపేట శ్రీనివాస్ మరియు
మహిళా కాంగ్రెస్ ప్రధానకార్యదర్శి జంగిటి మమత గారి ఆధ్వర్యంలో ముగ్గులపోటిలు నిర్వహించడం జరిగింది.
ఈ సందర్బంగా మాజీ కౌన్సిలర్ సాయి పేట శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మా గుండ్లపోచంపల్లి మున్సిపల్ లో ముగ్గుల పోటీలు నిర్వహిస్తామని శ్రీనివాస్ తెలిపారు, మహిళలు ఎంతో ఇష్టం జరుపుకొనే గొప్ప పండగ ఈ సంక్రాంతి పండుగ అని అన్నారు, మహిళలు పోటాపోటిగ వచ్చి వారిలో ఉన్న గొప్ప కళాకారులను బయటకు తీసుకువచ్చే అద్భుతమైన అవకాశం అని కూడా ఆయన అన్నారు,
మహిళలందరూ ఈ ముగ్గుల పోటీలో పాల్గొనడం చాలా సంతోషమని క శ్రీనివాస్ అన్నారు.
ముగ్గుల పోటీలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు.ముగ్గులపోటీలో మొదటి బహుమతి మౌనిక , ద్వితీయ బహుమతి శిరీష ,తృతీయ బహుమతి భాగ్య లు గెలుపొందారు. ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళలకు గుండ్లపోచంపల్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాయిపేట శ్రీనివాస్ మరియు గుండ్లపోచంపల్లి మాజీ సర్పంచ్ బండారి నరేందర్ చేతులమీదుగా బహుమతులు అందజేయ్యడం జరిగింది. ఈ కార్యక్రమం లో మాజీ ఎంపీటీసీ పులిగిల్ల రాజేశ్వర్, ఏ బ్లాక్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తాటికాయల కోమలత, మాజీ ఉపసర్పంచ్ చిల్ల వెంకటేష్, సాయిపేట మల్లేష్,కృష్ణారెడ్డి, కావలి భాస్కర్, గుండ్లపోచంపల్లి 299 డివిజన్ ఎస్సీ సెల్ అధ్యక్షులు కుండ భానుచందర్, మలిగే కిషన్, షబ్బీర్,చిల్ల సాయికుమార్,అబ్రర్ ఖాన్, వడ్డే ప్రవీణ్, పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు.


