డివైన్ వర్డ్ సెంటర్ చర్చి ప్రహరీ గోడ ప్రారంభించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
By Prajaswaram
On
పటాన్ చెరు,జనవరి 04(ప్రజా స్వరం)
పటాన్ చెరు నియోజకవర్గం డివిజన్ పరిధిలోని డివైన్ వర్డ్ సెంటర్ చర్చి ఆవరణలో నూతనంగా నిర్మించిన ప్రహరీ గోడను పటాన్చెరు శాసన సభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు ప్రారంభించారు.
ఈ సందర్భంగా చర్చిలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలలో ఎమ్మెల్యే పాల్గొని, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఏసుప్రభు కృపతో పటాన్చెరు నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ముత్తంగి మాజీ సర్పంచ్ ఉపేందర్‌తో పాటు సీనియర్ నాయకులు పాండు, శ్రీనివాస్, మేరాజ్ ఖాన్, రామకృష్ణ, రవి పాల్గొన్నారు. చర్చి పాస్టర్ సిరిల్, శ్రీనివాస్ తదితరులు కూడా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
Latest News
10 Jan 2026 19:20:02
చిన్న శంకరంపేట, జనవరి 10 ( ప్రజాస్వరం): జన్మించిన గ్రామంలోనే జన్మదిన వేడుకలు జరుపుకున్న మహానుభావుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మెదక్ నియోజకవర్గ ప్రజలకు


