కేటీఆర్ ను కలిసిన మేడ్చల్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు....
By Prajaswaram
On
ప్రజాస్వరం ,మేడ్చల్:
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను బుధవారం మేడ్చల్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. తిరుమల తిరుపతి దర్శనం చేసుకున్న మేడ్చల్ జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ భాస్కర్ యాదవ్ కేటీఆర్ నగరంలోని పార్టీ కార్యాలయంలో కలిసి స్వామి వారి ప్రసాదం అందజేశారు. అనంతరం పలు విషయాలపై చర్చించారు. మేడ్చల్ నియోజకవర్గం లో పార్టీ అభివృద్ధి పై భాస్కర్ యాదవ్, మేడ్చల్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు దయానంద్ యాదవ్ లను కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా (Sir) కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమంపై బీఆర్ఎస్ నాయకులు చొరవ చూపి, ప్రజలకు అవగాహన కలిగిస్తూ, ఎలాంటి తప్పులు జరగకుండా చూస్తూ విజయవంతం అయ్యేలా చూడాలని బీఆర్ఎస్ నాయకులకు సూచించలన్నారు. నియోజకవర్గంలో పార్టీ అభివృద్ధికి మరింత కృషి చేయాలన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలవద్ధకు తీసుకెళ్లి, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన పథకాలను గుర్తు చేయాలన్నారు.
Related Posts
Latest News
27 Aug 2026 11:57:23
రైతులు కేసీఆర్ ప్రభత్వాన్ని కోరుకుంటున్నారు మనోహరబాద్ (ప్రజాస్వరం) : రైతులకు యూరియా పంపిణీ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని మనోహరాబాద్ మండల బీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు...


