ఆలయ నిర్మాణానికి 50వేల రూపాయల ఆర్థిక సహాయం....
కావ్య....
By Prajaswaram
On
ప్రజాస్వరం, జవహర్ నగర్, జూలై 1 :
జవహర్ నగర్ లోని వికలాంగుల కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ కోదండరామ,ఆంజనేయ స్వామి ఆలయ నిర్మాణానికి జవహర్ నగర్ మాజీ మేయర్ మేకల కావ్య 50వేల రూపాయల విరాళాన్ని బుధవారం ఆలయ కమిటీ అందజేశారు. ఈ సందర్భంగా మేకల కావ్య మాట్లాడుతూ భగవంతుని ఆలయ నిర్మాణం భాగస్వామి అవ్వడం సంతోషంగా ఉందన్నారు.50 వేల రూపాయలు విరాళాన్ని అందించినందుకు కమిటీ సభ్యులు మాజీ మేయర్ కావ్య కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఉద్యమకారుల ఫోరం జవహర్ నగర్ అధ్యక్షుడు సుధాకర్ చారి, బీఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షుడు భార్గవరామ్, ఆలయ కమిటీ సభ్యులు,స్థానికులు పాల్గొన్నారు.
Related Posts
Latest News
03 Jul 2026 07:07:12
ప్రజాస్వరం , తూప్రాన్ : మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ లోని 16వ వార్డు లో స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం లో పాల్గొన్న తూప్రాన్ మున్సిపల్ 16...


