యూరియ అందుబాటులో ఉంచాలి ....
బీఆర్ఎస్ ....
By Prajaswaram
On
ప్రజాస్వరం, మనోహరాబాద్ :
రైతులకు అవసరమైన యూరియా అందుబాటులో ఉంచాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. సీ ఎం ఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన వారు మాట్లాడుతూ కేసీఆర్ అధికారం లో సీఎం గా ఉండి రైతులకు చేసిన మేలు ఎవరు చేయరని రైతులను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన గొప్ప నాయకుడని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవసరమైన యూరియా అందుబాటులో ఉంచాలని యాప్ ద్వారా యూరియా పంపిణీని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ర్యాకల శేఖర్ గౌడ్, మండల పార్టీ మాజీ అధ్యక్షులు పురం మహేష్ ముదిరాజ్, పర్కిబండ సర్పంచ్ మోతీబాయ్ లక్ష్మణ్ సింగ్, ఉప సర్పంచుల ఫోరం జిల్లా మాజీ అధ్యక్షులు పంచమి రేణు కుమార్ , దండుపల్లి మాజీ ఉప సర్పంచ్ మహేందర్ గౌడ్, ఆత్మ కమిటీ మాజీ డైరెక్టర్ భిక్షపతి, కాళ్లకల్ మైనార్టీ సెల్ నాయకులు ఇర్ఫాన్, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.
Related Posts
Latest News
27 Aug 2026 11:57:23
రైతులు కేసీఆర్ ప్రభత్వాన్ని కోరుకుంటున్నారు మనోహరబాద్ (ప్రజాస్వరం) : రైతులకు యూరియా పంపిణీ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని మనోహరాబాద్ మండల బీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు...


