సంతోష్ నగర్ లో వృద్ధుడి.....
నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు ...
By Prajaswaram
On
ప్రజాస్వరం, జవహర్ నగర్, జూలై 1 :
జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వృద్ధుడు దారుణ హత్యకు గురైన సంఘటన చోటుచేసుకుంది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జవహర్ నగర్ సంతోష్ నగర్ కు చెందిన మడిగే దేవరాజు అలియాస్ ఉప్పరి దేవరాజు (83 )గత కొద్ది కాలంగా సంతోష్ నగర్ లోని ఒక ఇంట్లో ఉంటున్నారు. అతనికి ఐదుగురు కొడుకు లు వయసు మీద పడటంతో అతనికి రోజు కొడుకులు భోజనం, బాగోగులు చూసుకుంటున్నారు. బుధవారం అయితే తేదీ ఉదయం ఏడు గంటల సమయంలో దేవరాజు పక్క ఇంట్లో ఉండే రమేష్ అనే వ్యక్తి దేవరాజు కొడుకు ఉప్పరి ప్రభాకర్ దగ్గరికి వెళ్లి రాత్రి సుమారు ఒంటిగంట సమయంలో మీ నాన్న దేవరాజ్ ఇంటికి ఎవరో గుర్తుతెలియని వ్యక్తి వచ్చారని ఇంట్లో గొడవ జరిగింది అని చెప్పగా వెంటనే ప్రభాకర్ తన తండ్రి నివసిస్తున్న ఇంటికి వెళ్లి చూడగా దేవరాజు తన గదిలో నేలపై వెలలికల పడి ఉన్నాడు. అతని తల వెనుక భాగం గాయాలు గుర్తించాడు. పక్కనగల బెడ్ పై ఒక గుర్తు తెలియని వ్యక్తి పడుకొని ఉన్నాడు. అతన్ని ప్రభాకర్ పఎవరు నువ్వు ఎందుకు ఇక్కడ ఉందాం అని అడగగా అతను పొంతనలేని సమాధానం చెప్పడంతో పోలీసులకు సమాచారం అందిస్తారు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఎక్కడున్నా వ్యక్తిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. తన పేరు దేవా (30 ) అని తనది సిద్దిపేట అని రాత్రి ఇక్కడ పడుకోవడానికి వచ్చానని తెలిపినాడు. రాత్రి తాను ఇక్కడికి రాగా ఒక ముసలాయన లైట్ వేశాడని దాంతో కోపం వచ్చి పిడికిలి బిగించి పలుమార్లు తల మీద గుడి చంపినట్లు తెలిపారు. ప్రభాకర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దేవాను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
Related Posts
Latest News
27 Aug 2026 11:57:23
రైతులు కేసీఆర్ ప్రభత్వాన్ని కోరుకుంటున్నారు మనోహరబాద్ (ప్రజాస్వరం) : రైతులకు యూరియా పంపిణీ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని మనోహరాబాద్ మండల బీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు...


