మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం అండగా ఉంటుంది ....
ఎమ్మెల్యే రోహిత్ .....
By Prajaswaram
On
ప్రజాస్వరం, రామాయంపేట :
రామాయంపేట మండలం తొనిగండ్ల గ్రామంలో మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ సోమవారం పర్యటించారు. గ్రామంలో రూ.10 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన మహిళా సమాఖ్య (మహిళా సంఘం) భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, మహిళా సంఘాలు గ్రామాభివృద్ధికి వెన్నెముకలాంటివని అన్నారు. మహిళలు స్వయం ఉపాధి, పొదుపు, ఆర్థిక స్వావలంబన దిశగా మరింత ముందుకు సాగేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని తెలిపారు. మహిళా సంఘాలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడం ద్వారా వారి కార్యకలాపాలు మరింత సమర్థవంతంగా కొనసాగుతాయని పేర్కొన్నారు.మహిళా సమాఖ్య భవనం గ్రామ మహిళలకు సమావేశాలు, శిక్షణా కార్యక్రమాలు, స్వయం ఉపాధి కార్యకలాపాల నిర్వహణకు ఎంతో ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే అన్నారు. గ్రామాల అభివృద్ధిలో మహిళల భాగస్వామ్యం కీలకమని, వారి అభ్యున్నతికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శివకుమారి నాగులు, ఉపసర్పంచ్ దుర్గయ్య, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బండారు మహేందర్ రెడ్డి, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మానేగళ్ల రాములు,వార్డు సభ్యులు బియ్య లక్ష్మి,వినోద్, బాలకృష్ణ, రమేష్, భాను, పలు గ్రామాల సర్పంచులు, మహిళా సంఘాల సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.
Latest News
29 Jun 2026 20:22:33
ప్రజాస్వరం, రామాయంపేట : రామాయంపేట మండలం తొనిగండ్ల గ్రామంలో మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ సోమవారం పర్యటించారు. గ్రామంలో రూ.10 లక్షల వ్యయంతో నూతనంగా


