ప్రజావాణిలో 95 దరఖాస్తులు.....

ప్రజావాణిలో 95 దరఖాస్తులు.....

ప్రజాస్వరం, మేడ్చల్ :

సోమవారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారులను డిఆర్ఓ మాలతి తో కలిసి అదనపు కలెక్టరు (95) దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టరు మాట్లాడుతూ ఎంతో వ్యయ, ప్రయాసలకోర్చుకొని వారి సమస్యలను పరిష్కరిస్తామనే నమ్మకంతో ప్రజలు మన వద్దకు వస్తారని, వారి నమ్మకాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత మనందరి పైన ఉన్నదని అదనపు కలెక్టర్ తెలిపారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని దరఖాస్తుల పరిశీలనలో ఏలాంటి జాప్యం లేకుండా చూడాలని అదనపు కలెక్టరు అన్నారు. అదేవిధంగా తిరస్కరించే దరఖాస్తుల గురించి తిరస్కరణకు గల కారణాలను తప్పనిసరిగా వివరంగా అర్జీదారులకు తెలియజేయాలని అధికారులకు సూచించారు. స్వీకరించిన దరఖాస్తులపై తీసుకున్న చర్యల వివరాలను ఆన్ లైన్ లో వెంట వెంట నమోదు చేయాలని సంబంధిత అధికారులకు అదనపు కలెక్టరు సూచించారు.

Latest News

 మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం అండగా ఉంటుంది .... మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం అండగా ఉంటుంది ....
    ప్రజాస్వరం, రామాయంపేట : రామాయంపేట మండలం తొనిగండ్ల గ్రామంలో మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ సోమవారం పర్యటించారు. గ్రామంలో రూ.10 లక్షల వ్యయంతో నూతనంగా
ప్రజావాణిలో 95 దరఖాస్తులు.....
97% మంది చిన్నారులకు పోలియో చుక్కలు - DMHO....
సర్ ప్రక్రియ అద్భుతంగా కొనసాగుతుంది .....
పేకాట స్థావరం పై పోలీసుల దాడి...
జలమయంలో తూప్రాన్ ప్రధాన రహదారి ….
డాజిల్ క్లాత్ స్టోర్ ను ప్రారంభించిన ఎంపీ ఈటెల,ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి...