మేడ్చల్ విద్యుత్ శాఖలో లైన్ మెన్ల హవా...
By Prajaswaram
On
మేడ్చల్, ఫిబ్రవరి 26 (ప్రజాస్వరం):
మేడ్చల్ విద్యుత్ శాఖలో లైన్‌మెన్‌ల హవా కొనసాగుతుందని ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి. కొత్త కనెక్షన్లు, మీటర్ మార్పులు, మరియు ట్రాన్స్‌ఫార్మర్ పనుల కోసం వినియోగదారుల నుండి లంచాలు డిమాండ్ చేస్తూ అవినీతికి పాల్పడుతున్నారు.₹2,000 నుండి లక్షల్లో లంచాలు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అసిస్టెంట్ ఇంజనీర్ మరియు లైన్‌మెన్‌లు, అవినీతికి పాల్పడి సస్పెండ్ అయిన సందర్భాలు ఇటీవల తెలంగాణలో వెలుగు చూసినప్పటికి మేడ్చల్ లో మాత్రం ఏ మార్పు రావట్లేదు.లంచం ఇవ్వకపోతే ఎదో ఒక సాకు చెప్పి రిజెక్ట్ చేస్తూన్నారనే ఆరోపణలు చాలానే ఉన్నాయి. ఇప్పటికైనా ఏసిబి అధికారులు మేడ్చల్ విద్యుత్ శాఖ కార్యాలయం పై నిఘా పెట్టి అవినీతి జరగకుండా చూడాలని కోరుతున్నారు.
Latest News
10 Mar 2026 20:45:12
తూప్రాన్ ,మార్చ్ 10 (ప్రజాస్వరం) : పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ పరిధిలోని అల్లాపూర్ చెందిన జ్యోతిని చేగుంట మండలం రాంపూర్ చెందిన...


