16వ వార్డులో ప్రచారం లో దూసుకుపోతున్న కమలం ...

16వ వార్డులో ప్రచారం లో దూసుకుపోతున్న కమలం ...

ఇంటింటి ప్రచారానికి భారీ స్పందన..

మోడీకే ఓటు వేస్తామని హామీ ఇచ్చిన ఓటర్లు..

తూప్రాన్, జనవరి 25 (ప్రజాస్వరం):

పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి

తూప్రాన్ మున్సిపాలిటీలో 16వ వార్డులో ఆదివారం బిజెపి అభ్యర్థి కంటయపాలెం నవ్య కార్యకర్తల తో కలసి ఉదయం నుంచి ఇంటింటి ప్రచారం చేశారు. మోడీ చేస్తున్న అభివృద్ధి పనులు మున్సిపాలిటీకి కేంద్రం నుంచి వస్తున్న నిధులను వివరిస్తూ ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు 

 వార్డులో ఓటర్లు కూడా మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడే బిజెపి పార్టీకే మోడీ గుర్తు పువ్వు గుర్తుకే ఓటు వేస్తామని భరోసా ఇస్తున్నారని ఆమె తెలిపారు. 16వ వార్డులోని ఆర్యవైశ్యులు వ్యాపారస్తులు జాతీయ పార్టీ బిజెపికి మా మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. నవ్య చదువుకున్న అభ్యర్థి లెక్చరర్ కావడంతో వార్డులో ఉండే నిత్యం ప్రజల మధ్యలో ఉండే అభ్యర్థికే ఓటు వేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో అభ్యర్థి కంటాయపాలెం నవ్య శ్రీ, వేణుగోపాల్ , బిజెపి నాయకులు పార్టీ విట్టల్, పోతరాజు శరత్, మాజీ మండల పార్టీ అధ్యక్షులు మహేష్ గౌడ్,, సీనియర్ నాయకులు కొజ్జపురం మధుసూదన్ గౌడ్, వైస్ ప్రెసిడెంట్ పోతరాజు నాగరాజు , కోటేశ్వరరావు బద్రీనాథ్ , రాకేష్ మధుసూదన్,

 రాస మల్ల వెంకటేష్, వంశి, సురేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు

Latest News

వాణిజ్య శాస్త్ర అధ్యాపకురాలికి డాక్టరేట్... వాణిజ్య శాస్త్ర అధ్యాపకురాలికి డాక్టరేట్...
మెదక్, ఫిబ్రవరి 06 (ప్రజాస్వరం):   స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వాణిజ్య శాస్త్ర ఆధ్యాపకురాలిగా పనిచేస్తున్న పైడి హరిత డాక్టరేట్ పొందినట్లు కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కే...
13వ వార్డులో జానకిరామ్ గౌడ్ ఇంటింటా ప్రచారం.... 
తూప్రాన్ లో పోలీస్ ల ప్లాగ్ మార్చ్..... 
అక్రమ మద్యం రవాణా చేస్తున్న వ్యక్తి అరెస్ట్...
షాపుల వద్ద సీసీ కెమెరాలు తప్పనిసరి....
104 లీటర్ల మద్యం స్వాధీనం, స్విఫ్ట్ కారు సీజ్...
14వ వార్డులో జనసేన అభ్యర్థి జంగం స్వాతి సుధాకర్ హోరాహోరీ ప్రచారం...