జంగంపేట్ బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్‌లో చేరిక

జంగంపేట్ బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్‌లో చేరిక

జిన్నారం, జనవరి 21(ప్రజాస్వరం):


జిన్నారం మున్సిపాలిటీ పరిధిలోని జంగంపేట్ గ్రామానికి చెందిన మాజీ ఉపసర్పంచ్ గోవర్ధన్ రెడ్డి, మాజీ వార్డు సభ్యులు స్వప్న గోవర్ధన్ రెడ్డి, నాగమణి, ఈశ్వరయ్య, రాములమ్మ మరియు అనుచరులు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు.

పటాన్‌చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కాట శ్రీనివాస్ గౌడ్ సమక్షంలో ఈ చేరిక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కాట శ్రీనివాస్ గౌడ్ కొత్తగా పార్టీలో చేరిన నాయకులకు కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.

స్థానికంగా కాంగ్రెస్ పార్టీలో బలం పెరుగుతుందని నాయకులు అభిప్రాయపడ్డారు.