ఇమాంపూర్ గ్రామంలో రీ-సర్వే పనులను పరిశీలించిన...
చంద్రశేఖర్ రెడ్డి తహసీల్దార్ ....
By Prajaswaram
On
తూప్రాన్, అక్టోబర్ 13 (ప్రజాస్వరం) :
మెదక్ జిల్లా తూప్రాన్ మండలంలోని ఇమాంపూర్ గ్రామంలో మంగళవారం రోజు జరుగుతున్న భూముల రీ-సర్వే పనులను తహసీల్దార్ చంద్ర శేఖర్ రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా రీ-సర్వే పనులను నిర్దేశిత మార్గదర్శకాల ప్రకారం పారదర్శకంగా, ఖచ్చితత్వంతో పూర్తి చేయాలని సంబంధిత సిబ్బందికి ఆయన పలు సూచనలు చేశారు.అనంతరం గ్రామ రైతులతో మాట్లాడి, రీ-సర్వే ద్వారా భూముల సరిహద్దుల నిర్ధారణ, భూ రికార్డులలో ఖచ్చితత్వం పెంపొందించడం, భవిష్యత్తులో భూ సంబంధిత వివాదాలను నివారించడం వంటి ప్రయోజనాలను వివరించారు. రైతులు రీ-సర్వే ప్రక్రియపై అవగాహన కలిగి ఉండి, సర్వే సిబ్బందికి అవసరమైన సహకారం అందించాలని తహసీల్దార్ సూచించారు.ఈ కార్యక్రమంలో సంబంధిత రెవెన్యూఇన్స్పెక్టర్ ప్రేమ్ కుమార్ సిబ్బంది, సర్వే సిబ్బంది మరియు గ్రామ రైతులు పాల్గొన్నారు.
Latest News
13 Oct 2026 18:44:07
ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రూ.4,016 జీవనభృతి వెంటనే అమలు చేయాలి.. హామీని నిలబెట్టుకోకుంటే కార్మికుల ఆగ్రహానికి గురికాక తప్పదు.. యూనియన్ నాయకులు.. నార్సింగి, అక్టోబర్ 13(...


