చాకలి ఐలమ్మ విగ్రహం ధ్వంసంపై నిరసన....
By Prajaswaram
On
దుండగులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలి..రజక సంఘం డిమాండ్...
చిన్న శంకరంపేట,అక్టోబర్ 13 (ప్రజాస్వరం) :
మెదక్ జిల్లా కేంద్రంలో చాకలి ఐలమ్మ విగ్రహాన్ని గత రాత్రి గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ మంగళవారం చిన్న శంకరంపేట మండలం అంబాజీపేటలో రజక సంఘం ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. చాకలి ఐలమ్మ విగ్రహంపై దాడికి పాల్పడిన వారిని వెంటనే గుర్తించి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ చేగుంట–మెదక్ ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రజక సంఘం నాయకులు మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేయడం బాధాకరమని అన్నారు. సమాజం గర్వించదగిన పోరాట యోధురాలి విగ్రహంపై దాడికి పాల్పడిన వారిని పోలీసులు వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. రోడ్డుకు ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ధర్నా విరామింపజేశారు. ఈ నిరసన కార్యక్రమంలో అంబాజీపేట రజక సంఘం నాయకులు, సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Latest News
13 Oct 2026 18:44:07
ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రూ.4,016 జీవనభృతి వెంటనే అమలు చేయాలి.. హామీని నిలబెట్టుకోకుంటే కార్మికుల ఆగ్రహానికి గురికాక తప్పదు.. యూనియన్ నాయకులు.. నార్సింగి, అక్టోబర్ 13(...


