అమ్మవారిని దర్శించుకున్న బిగ్ బాస్ యాంకర్స్...
తూప్రాన్ మహంకాళి దేవాలయంలో ప్రముఖ నటీమణుల ప్రత్యేక పూజలు..
నవదుర్గ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తూప్రాన్ మహంకాళి దేవాలయంలో నిర్వహించే దేవి నవరాత్రుల్లో అమ్మవారిని ప్రముఖ నటీమణులు బిగ్ బాస్ ఫేమ్ ఆశు రెడ్డి, ప్రవీణాలు, వారి కుటుంబ సభ్యులు రాకేష్ రెడ్డి అనిల్ దంపతులతో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి దేవాలయం వద్ద సందడి చేశారు. ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర నాయకులు కుడిపాక నారాయణ గుప్తా ఆధ్వర్యంలో ప్రముఖ నటిమణులు దేవాలయానికి విచ్చేసి అమ్మవారికి కుంభహారతి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బిగ్బాస్ బిగ్ బాస్ ఫ్రేమ్ నటీమణులు ఒక్కసారిగా దేవాలయంలో ప్రత్యక్షమవడంతో అభిమానులు సెల్ఫీ తీసుకొని సందడి చేశారు, ఈ కార్యక్రమంలో నిర్వాహకులు కోటేశ్వరరావు, తాటి విట్టల్, శంకరంపేట్ నాగరాజు గౌడ్, సూర్య ప్రకాష్ గౌడ్, గడ్డం శ్రీనివాస్, శ్రీనివాస్ రెడ్డి, వేణుగోపాల్, పోతరాజు, నాగరాజు, మధు, చందు తదితరులు పాల్గొన్నారు.


