అంగన్వాడీ, ఆశా కార్యకర్తల సేవలు అమూల్యం....
బీజేపీ అధ్యక్షులు వెంకటేష్ గౌడ్ ....
By Prajaswaram
On
మనోహరాబాద్, (ప్రజాస్వరం) :
మనోహరాబాద్ మండలం జీడిపల్లి గ్రామంలో 'సేవా సంకల్ప అభియాన్' కార్యక్రమంలో భాగంగా సమాజానికి విశేష సేవలందిస్తున్న అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు మరియు అంగన్వాడీ సిబ్బందిని ఘనంగా సన్మానించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల ఆరోగ్య రక్షణలో, పిల్లల పౌష్టికాహార పంపిణీలో వారు అందిస్తున్న సేవలను గుర్తించి ఈ ఆత్మీయ సత్కార కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని సేవా సంకల్ప అభియాన్ కన్వీనర్ కొల్తూరి నరేష్ గౌడ్, కో-కన్వీనర్ పరుం నరేష్ ల ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల పార్టీ అధ్యక్షులు వెంకటేష్ గౌడ్ హాజరయ్యారు.ఈ సందర్భంగా ముఖ్య అతిథి వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ... క్షేత్రస్థాయిలో రాత్రింబవళ్ళు కష్టపడి పనిచేస్తూ, ప్రజలకు సంక్షేమ పథకాలను, ఆరోగ్య సేవలను చేరువ చేస్తున్న అంగన్వాడీ మరియు ఆశా వర్కర్ల సేవలు ఎంతో ప్రశంసనీయమని కొనియాడారు. వారి సేవలను గుర్తించి సన్మానించడం అభినందనీయమని కన్వీనర్లను అభినందించారు.కార్యక్రమ కన్వీనర్ కొల్తూరి నరేష్ గౌడ్ మరియు కో-కన్వీనర్ పరుం నరేష్ మాట్లాడుతూ... సమాజ సేవలో ముందుండే ప్రతి ఒక్కరినీ గుర్తించి ప్రోత్సహించడమే 'సేవా సంకల్ప అభియాన్' ముఖ్య ఉద్దేశమని తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు ఏఎన్ఎంఎస్ కార్యకర్తలు, నాగు ముదిరాజ్, రచ్చ శ్రీకాంత్ పాల్గొన్నారు.
Latest News
03 Oct 2026 11:59:32
మనోహరాబాద్, (ప్రజాస్వరం) : మనోహరాబాద్ మండలం జీడిపల్లి గ్రామంలో 'సేవా సంకల్ప అభియాన్' కార్యక్రమంలో భాగంగా సమాజానికి విశేష సేవలందిస్తున్న అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు మరియు...


