చందంపేటలో పురాతన గడి కోటకు కొలతలు..
By Prajaswaram
On
చందమ్మకోట సుందరీకరణకు తొలి అడుగులు..
చిన్న శంకరంపేట, సెప్టెంబర్ 30 ( ప్రజాస్వరం ) :
చిన్న శంకరంపేట మండలం చందంపేట గ్రామంలోని అతి పురాతనమైన చందమ్మకోట (గడి కోట) సుందరీకరణకు తొలి అడుగులు ప్రారంభమయ్యాయి. పురాతన కట్టడాలను సంరక్షించి వాటి చారిత్రక ప్రాధాన్యతను కాపాడాలన్న జిల్లా కలెక్టర్ ప్రతిమ సింగ్ ఆదేశాల మేరకు ఈ చర్యలు చేపట్టారు.డెక్కన్ టెర్రా, హెరిటేజ్ సంస్థల ప్రతినిధులు చందమ్మకోటను సందర్శించి, కోట పరిసరాలను పరిశీలించారు. సుందరీకరణ, అభివృద్ధి పనులకు సంబంధించి గడి కోట చుట్టూ కొలతలు తీసుకున్నారు. కోట చారిత్రక నేపథ్యాన్ని కాపాడుతూ భవిష్యత్‌లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు అనుగుణంగా ప్రాథమికంగా స్థల పరిశీలన, కొలతలు చేపట్టినట్లు సంస్థ ప్రతినిధులు మీర్కన్, డాక్టర్ మంజుల, జైఇకల్, నైనాషాహరీ, జనాత్ తెలిపారు.ఈ కార్యక్రమంలో చందంపేట సర్పంచ్ నాయిని ప్రవీణ్ కుమార్, ఉప సర్పంచ్ నర్సింలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా సర్పంచ్ ప్రవీణ్ మాట్లాడుతు పురాతన చందమ్మకోటకు సుందరీకరణ చేపట్టడంతో గ్రామానికి చారిత్రక గుర్తింపు మరింత పెరగడంతో పాటు, భవిష్యత్‌లో పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Latest News
30 Sep 2026 20:47:50
తూప్రాన్, సెప్టెంబర్ 30( ప్రజాస్వరం) : ప్రతినిధి మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీలోని బ్రహ్మణపల్లి వద్ద అమూల్ పాల కంపెనీ భూమిపూజ కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ మంత్రి...


