రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ ఆందోళన...
By Prajaswaram
On
మెదక్, సెప్టెంబర్ 30 (ప్రజాస్వరం) :
సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ పట్టణ అధ్యక్షుడు నాయిని ప్రసాద్ ఆధ్వర్యంలో బుధవారం మెదక్ రాందాస్ చౌరస్తాలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ ను దహనం చేశారు. హిందూ దేవుళ్ల పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ తెలిపారు. ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన దేవుడిని ఆరాధించుకునే హక్కు ఉందని, ఇతరుల మత విశ్వాసాలను గౌరవించాలని అన్నారు. దేశాన్ని ప్రాంతాల వారీగా విభజించే వ్యాఖ్యలు చేయడం ద్వారా ప్రజల మనోభావాలను దెబ్బతీయవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ పబ్బ రాజమణి లక్ష్మణ్, మెదక్ జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షుడు బజ్జూరి భిక్షపతి, జనరల్ సెక్రటరీ రంజిత్ రెడ్డి, సాయి గౌడ్, సాయి దీపు, జిల్లా నాయకులు లోకేష్, అల్లం మధు, రాహుల్, ఆమ్దం సాయి, సన్నీ, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
Latest News
30 Sep 2026 20:47:50
తూప్రాన్, సెప్టెంబర్ 30( ప్రజాస్వరం) : ప్రతినిధి మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీలోని బ్రహ్మణపల్లి వద్ద అమూల్ పాల కంపెనీ భూమిపూజ కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ మంత్రి...


