పేదలకు న్యాయంగా ఇళ్ల పట్టాలు...
ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు....
By Prajaswaram
On
గత పాలనలో పేదలకు అన్యాయం జరిగింది...
మెదక్, సెప్టెంబర్ 29 (ప్రజాస్వరం) :
మెదక్ జిల్లా కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర గార్డెన్స్‌లో పేదలకు డబుల్ బెడ్‌రూం ఇళ్ల పట్టాలను ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్‌రావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన పేదలందరికీ న్యాయంగా ఇళ్లు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు. గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో పేదలకు ఇళ్ల విషయంలో అన్యాయం జరిగిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందిరమ్మ రాజ్యంలో పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. సన్నబియ్యం, ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. గత ప్రభుత్వ పాలనలో అవినీతి జరిగిందని ఆరోపించిన ఎమ్మెల్యే ప్రజలకు ఆశలు కల్పిస్తూ పదేళ్లు కాలయాపన చేశారని విమర్శించారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని అన్నారు. దళిత బంధు పథకం ద్వారా గతంలో ఎంత మందికి లబ్ధి చేకూర్చారో చెప్పాలని ప్రశ్నించారు. ప్రజల మధ్య నిరంతరం పర్యటిస్తూ వారి సమస్యలను తెలుసుకుంటున్నామని తెలిపారు. గ్రామాల్లో పర్యటించినప్పుడు పేదలు ఇళ్ల కోసం తమ సమస్యలను చెబుతున్నారని, అర్హులైన ప్రతి కుటుంబానికి న్యాయంగా ఇళ్లు అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇళ్ల మంజూరు కోసం ఎవరూ డబ్బులు ఇవ్వవద్దని ఎమ్మెల్యే సూచించారు. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి పారదర్శకంగా ఇళ్లు అందేలా పనిచేస్తామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ తప్పిదాలను తమ ప్రభుత్వంపై నెట్టే ప్రయత్నాలను సహించబోమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రమాదేవి, ఎమ్మార్వో లక్ష్మణ్ బాబు, హౌసింగ్ పీడీ మాణిక్యం, మున్సిపల్ చైర్మన్ రాధిక, వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్, మున్సిపల్ కమిషనర్ నవీన్, కౌన్సిలర్స్ గంట సంపత్, మన్సూర్, దీపక్ కుమార్, జుబెర్, బట్టి ఉదయ్, హరిత, రాణి, చింతల స్వరగిణీ, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Latest News
30 Sep 2026 20:47:50
తూప్రాన్, సెప్టెంబర్ 30( ప్రజాస్వరం) : ప్రతినిధి మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీలోని బ్రహ్మణపల్లి వద్ద అమూల్ పాల కంపెనీ భూమిపూజ కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ మంత్రి...


