అమిత్ షా పర్యటన నేపథ్యంలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు...

అమిత్ షా పర్యటన నేపథ్యంలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు...

తూప్రాన్, సెప్టెంబర్ 30( ప్రజాస్వరం) :

ప్రతినిధి 

మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీలోని బ్రహ్మణపల్లి వద్ద అమూల్‌ పాల కంపెనీ భూమిపూజ కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా అక్టోబర్‌ 4న హాజరుకానున్న నేపథ్యంలో మెదక్‌ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు బుధవారం కార్యక్రమ ప్రదేశాన్ని పరిశీలించి భద్రతా ఏర్పాట్లను ఎస్పీ సమీక్షించారు.ఈ సందర్భంగా కార్యక్రమ వేదిక, వీవీఐపీ రాకపోకల మార్గాలు, పార్కింగ్‌ ప్రాంతాలు, సభా ప్రాంగణం, పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. వీవీఐపీ భద్రత, బందోబస్తు, ట్రాఫిక్‌ నియంత్రణ, పార్కింగ్‌, ప్రజలు, వీఐపీల ప్రవేశ, నిష్క్రమణ మార్గాలకు సంబంధించి చేపట్టాల్సిన ముందస్తు చర్యలపై పోలీసు అధికారులతో ఎస్పీ చర్చించారు.కార్యక్రమానికి హాజరయ్యే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్‌ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, వాహనాల పార్కింగ్‌కు తగిన ఏర్పాట్లు చేయాలని ఎస్పీ సూచించారు. కార్యక్రమ ప్రాంగణం, పరిసర ప్రాంతాల్లో నిరంతరం నిఘా కొనసాగించాలని, అనుమానాస్పద వ్యక్తులు, వస్తువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సూచించారు.వీవీఐపీ పర్యటన నేపథ్యంలో విధులు నిర్వహించే ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది తమకు కేటాయించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని ఎస్పీ ఆదేశించారు. భద్రతా ఏర్పాట్లలో ఎలాంటి లోపాలకు తావులేకుండా సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుంటూ ముందస్తు చర్యలు చేపట్టాలని ఎస్పీ శ్రీనివాస్ రావు స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో తూప్రాన్‌ డీఎస్పీ జె. నరేందర్‌ గౌడ్‌, సీఐలు సందీప్‌ రెడ్డి, రంగకృష్ణ, ఆర్‌ఐ శైలేందర్‌, ఎస్‌ఐలు గంగా రాజు, సుభాష్‌ గౌడ్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Latest News

అమిత్ షా పర్యటన నేపథ్యంలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు... అమిత్ షా పర్యటన నేపథ్యంలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు...
తూప్రాన్, సెప్టెంబర్ 30( ప్రజాస్వరం) : ప్రతినిధి  మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీలోని బ్రహ్మణపల్లి వద్ద అమూల్‌ పాల కంపెనీ భూమిపూజ కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ మంత్రి...
చందంపేటలో పురాతన గడి కోటకు కొలతలు..
విషాదంలో ఉన్న కుటుంబానికి భరోసా....
పేదలకు న్యాయంగా ఇళ్ల పట్టాలు...
రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ ఆందోళన...
శ్రీ గౌరీ లిక్కర్ మార్ట్‌లో అర్ధరాత్రి చోరీ....
బాధిత కుటుంబాలకు కంఠారెడ్డి భరోస.....