ఆర్టీసీ బస్సు ఢీ కొని వ్యవసాయ శాఖ ఉద్యోగి ....
By Prajaswaram
On
మెదక్, అక్టోబర్ 02 (ప్రజాస్వరం) :
మెదక్ జిల్లా కేంద్రంలోని ఎఫ్‌సీఐ గోదాముల సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యవసాయ శాఖ జూనియర్ అసిస్టెంట్ సద్దాం హుస్సేన్ మృతి చెందారు. రామాయంపేట నుంచి మెదక్‌కు వస్తున్న ఆర్టీసీ బస్సు (టీఎస్ 36 టి 0251) బుల్లెట్ పై వెళ్తున్న సద్దాం హుస్సేన్ వాహనాన్ని ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సద్దాం హుస్సేన్ మృతి చెందారు. సమాచారం అందుకున్న మెదక్ పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. సద్దాం హుస్సేన్ మృతి తో మెదక్ పట్టణంలో విషాదం నెలకొంది.
Latest News
02 Oct 2026 15:28:42
తూప్రాన్, అక్టోబర్ 02.(ప్రజాస్వరం): పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి గాంధీ జయంతి సందర్భంగా మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలోని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ...


