తూప్రాన్ లో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు ...
By Prajaswaram
On
తూప్రాన్, అక్టోబర్ 02.(ప్రజాస్వరం):
పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి
గాంధీ జయంతి సందర్భంగా మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలోని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ మాజీ సర్పంచ్ ల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు మైపాల్ రెడ్డి పాల్గొని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... మహాత్మా గాంధీ చూపిన సత్యం, అహింస మార్గం నేటి సమాజానికి ఎంతో అవసరమని, గాంధీ ఆశయాలను ప్రతి ఒక్కరూ పాటించాలని నాయకులు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు,భాస్కర్ రెడ్డి, నర్సింగరావు గడప దేవేందర్, వెంకటేష్ గుప్త, గడ్డం వెంకటేష్ యాదవ్, విశ్వరాజ్ శేషుభూషణ్ రెడ్డి, అనిల్ గౌతమ్ గౌడ్, అబోథ్ వెంకటేష్ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
Latest News
02 Oct 2026 15:28:42
తూప్రాన్, అక్టోబర్ 02.(ప్రజాస్వరం): పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి గాంధీ జయంతి సందర్భంగా మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలోని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ...


