బీడీ కార్మికుల జీవనభృతి కోసం భారీ ర్యాలీ, ధర్నా..

బీడీ కార్మికుల జీవనభృతి కోసం భారీ ర్యాలీ, ధర్నా..

ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రూ.4,016 జీవనభృతి వెంటనే అమలు చేయాలి..

హామీని నిలబెట్టుకోకుంటే కార్మికుల ఆగ్రహానికి గురికాక తప్పదు.. యూనియన్ నాయకులు..

 

నార్సింగి, అక్టోబర్ 13( ప్రజాస్వరం ) :

/ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బీడీ కార్మికులందరికీ నెలకు రూ.4,016 జీవనభృతిని ఎలాంటి షరతులు లేకుండా వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ (టీయూసీఐ) ఆధ్వర్యంలో మంగళవారం భారీ ర్యాలీ, ధర్నా నిర్వహించారు. మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు బీడీ కార్మికులు భారీ ర్యాలీగా వెళ్లి, అక్కడ ధర్నా చేపట్టారు. అనంతరం బీడీ కార్మికుల వ్యక్తిగత దరఖాస్తు ఫారాలను తహసీల్దార్ గ్రేస్‌బాయికి అందజేశారు. ఈ సందర్భంగా సీపీఐ (ఎం-ఎల్) మాస్ లైన్ ప్రజాపంథా పార్టీ రాష్ట్ర నాయకులు పిట్ల రామకృష్ణ మాట్లాడుతూ, 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే బీడీ కార్మికులకు విధించిన కటాఫ్ తేదీని తొలగించి, అర్హులైన కార్మికులందరికీ జీవనభృతి అమలు చేస్తామని హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. ప్రస్తుతం రూ.2,016 జీవనభృతి పొందుతున్న వారికి మరో రూ.2,000 పెంచి నెలకు రూ.4,016 అందిస్తామని ప్రకటించారని తెలిపారు. అధికారంలోకి వచ్చి ఇంతకాలమైనా ఇచ్చిన హామీని అమలు చేయకపోవడం వల్ల బీడీ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన విమర్శించారు. బీడీ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్న కార్మికుల కుటుంబాల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని, ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. కటాఫ్ తేదీ పేరుతో కార్మికులకు అన్యాయం చేయకుండా ఎలాంటి షరతులు లేకుండా ప్రతి బీడీ కార్మికుడికి నెలకు రూ.4,016 జీవనభృతిని అందించాలని కోరారు. లేనిపక్షంలో గతంలో కేసీఆర్‌కు ఎదురైన రాజకీయ పరిస్థితులే రేవంత్‌రెడ్డికి ఎదురవుతాయని హెచ్చరించారు. యూనియన్ రాష్ట్ర నాయకులు ఆర్. రమేష్, సత్తమ్మ మాట్లాడుతూ బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులందరికీ ఎలాంటి ఆంక్షలు, వివక్ష లేకుండా జీవనభృతి అందించాలని డిమాండ్ చేశారు. ఎన్నో ఏళ్లుగా బీడీలు చుడుతూ కుటుంబాలను పోషించుకుంటున్న కార్మికులకు ప్రభుత్వ సాయం ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని అమలు చేయకుండా జాప్యం చేయడం సరైంది కాదని అన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి జీవనభృతిని అమలు చేయాలని, లేకుంటే బీడీ కార్మికుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. బీడీ కార్మికుల హక్కుల సాధన కోసం పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని యూనియన్ నాయకులు స్పష్టం చేశారు. ప్రభుత్వం స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని, జీవనభృతిని వెంటనే అందించి తమ కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించాలని కార్మికులు కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ (టీయూసీఐ) కామారెడ్డి జిల్లా నాయకులు ప్రకాష్, కామారెడ్డి–నిజామాబాద్ రూరల్ ఉమ్మడి జిల్లాల బీడీ వర్కర్స్ యూనియన్ నాయకులు ఎస్. కిషోర్, వ్యవసాయ కార్మిక సంఘం కామారెడ్డి–నిజామాబాద్ రూరల్ జిల్లాల నాయకులు బి. కిషోర్‌తో పాటు పెద్ద సంఖ్యలో బీడీ కార్మికులు పాల్గొన్నారు.

Latest News

బీడీ కార్మికుల జీవనభృతి కోసం భారీ ర్యాలీ, ధర్నా.. బీడీ కార్మికుల జీవనభృతి కోసం భారీ ర్యాలీ, ధర్నా..
ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రూ.4,016 జీవనభృతి వెంటనే అమలు చేయాలి.. హామీని నిలబెట్టుకోకుంటే కార్మికుల ఆగ్రహానికి గురికాక తప్పదు.. యూనియన్ నాయకులు..   నార్సింగి, అక్టోబర్ 13(...
అమ్మవారిని దర్శించుకున్న బిగ్ బాస్ యాంకర్స్...
ఇమాంపూర్ గ్రామంలో రీ-సర్వే పనులను పరిశీలించిన...
ప్రజాసేవ, వృత్తిపరమైన నిబద్ధతపై పోలీసులకు వ్యాసరచన పోటీలు...
ఐలమ్మ విగ్రహం ధ్వంసంపై కఠిన చర్యలు తీసుకోవాలి...
నిందితులను గుర్తించి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌...
చాకలి ఐలమ్మ విగ్రహం ధ్వంసంపై నిరసన....