ప్రజాసేవ, వృత్తిపరమైన నిబద్ధతపై పోలీసులకు వ్యాసరచన పోటీలు...

పోటీలను ప్రారంభించిన జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు...

ప్రజాసేవ, వృత్తిపరమైన నిబద్ధతపై పోలీసులకు వ్యాసరచన పోటీలు...

మెదక్, అక్టోబర్ 13 (ప్రజాస్వరం) :

పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం (పోలీస్ ఫ్లాగ్ డే) సందర్భంగా మంగళవారం మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ సిబ్బందికి వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ప్రజాసేవ పట్ల బాధ్యత, వృత్తిపరమైన నిబద్ధత, సోషల్ మీడియా బాధ్యతాయుత వినియోగం పై అవగాహన కల్పించడమే పోటీల ఉద్దేశమని ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు తెలిపారు. కానిస్టేబుల్ నుంచి ఏఎస్ఐ స్థాయి వరకు సిబ్బందికి రెండు అంశాలపై పోటీలు నిర్వహించగా, వివిధ పోలీస్ స్టేషన్ల సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రజల ఆశలకు అనుగుణంగా సేవలందించడం తో పాటు సోషల్ మీడియాను సమాజ ప్రయోజనాలకు వినియోగించుకోవాలని ఎస్పీ సూచించారు. అలాగే జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో విద్యార్థులకు తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో వ్యాసరచన పోటీలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ, వారి స్ఫూర్తితో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సిబ్బందికి పిలుపునిచ్చారు.

Latest News

బీడీ కార్మికుల జీవనభృతి కోసం భారీ ర్యాలీ, ధర్నా.. బీడీ కార్మికుల జీవనభృతి కోసం భారీ ర్యాలీ, ధర్నా..
ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రూ.4,016 జీవనభృతి వెంటనే అమలు చేయాలి.. హామీని నిలబెట్టుకోకుంటే కార్మికుల ఆగ్రహానికి గురికాక తప్పదు.. యూనియన్ నాయకులు..   నార్సింగి, అక్టోబర్ 13(...
అమ్మవారిని దర్శించుకున్న బిగ్ బాస్ యాంకర్స్...
ఇమాంపూర్ గ్రామంలో రీ-సర్వే పనులను పరిశీలించిన...
ప్రజాసేవ, వృత్తిపరమైన నిబద్ధతపై పోలీసులకు వ్యాసరచన పోటీలు...
ఐలమ్మ విగ్రహం ధ్వంసంపై కఠిన చర్యలు తీసుకోవాలి...
నిందితులను గుర్తించి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌...
చాకలి ఐలమ్మ విగ్రహం ధ్వంసంపై నిరసన....