బాలమ్మ సేవలను ఆదర్శంగా తీసుకోవాలి....

 బాలమ్మ సేవలను ఆదర్శంగా తీసుకోవాలి....

మాజీ సర్పంచ్ బాలమ్మ సేవలను ఆదర్శంగా తీసుకోవాలి...

ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు చేసిన సేవలు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా ఉంటాయి...

ములుగు, అక్టోబర్ 10 (ప్రజాస్వరం):

ప్రజా ప్రతినిధిగా ఉన్నప్పుడు చేసిన సేవలు ప్రజల హృదయాల్లో చిరస్తాయిగా నిలిచిపోయేలా పదిలంగా ఉంచుతాయని గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి,ఉమ్మడి  జిల్లా డిసిసిబి డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి, పంచాయితీ రాజ్ సంఘటన్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు కడపల్ల నరసింహా రెడ్డి,జిల్లా సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు కొన్యాల బాల్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు జుబేరు పాషా,ఎస్సై రఘుపతి సూచించారు.సిద్దిపేట జిల్లా మండల కేంద్రమైన ములుగులో దివంగత మాజీ సర్పంచ్ చింతకింది బాలమ్మ 17వ వర్ధంతి వేడుకలను కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నర్సారెడ్డి,అంజిరెడ్డి,జెడ్పీ కో ఆప్షన్ మాజీ సభ్యుడు సలీం,సర్పంచ్ తీగుళ్ల కనకయ్య,మార్కెట్ కమిటీ అధ్యక్షురాలు బాగానోళ్ల విజయ మోహన్,ఉపాధ్యక్షుడు ప్రభాకర్ గుప్త,ఎస్సై, బీఆర్ఎస మండల పార్టీ అధ్యక్షుడు జహంగీర్,కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు కడపల్ల కృష్ణా రెడ్డి,మాజీ జెడ్పీటీసీ నర్సంపల్లి జయమ్మ అర్జున్ గౌడ్,మాజీ ఎంపీపీ వెంకట్రామిరెడ్డి,మాజీ ఎంపీటీసీ లింగ హరిబాబు హాజరై బాలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివలర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ములుగు గ్రామ సర్పంచ్ గా బాలమ్మ పారిశుధ్యం,త్రాగు నీటి సమస్యలు లేకుండా చూడటం,విద్యుత్ దీపాల ఏర్పాటు,సీసీ రోడ్లు,మురికి కాలువల నిర్మాణం వంటి సేవలు చిరస్మరణీయం అన్నారు. నేటితరం ప్రజా ప్రతినిధులు బాలమ్మ సేవలను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ లు కుతాడి శ్రీనివాస్,వాజిద్,మాజీ సర్పంచ్ మక్తాల వెంకటేష్ గౌడ్,జలాల్ పురం రామచంద్రం,వార్డు సభ్యులు నగేష్,తోడేటి లావణ్య రవి,మంద వెంకటేష్,తూర్పింటి లక్ష్మణ్,నాయకులు రంగ సత్యనారాయణ గౌడ్,తీగుళ్ల కుమార్,శివరాములు,ప్రశాంత్ రెడ్డి,నరేందర్ రెడ్డి,రవీందర్ రెడ్డి,శివారెడ్డి,తోడేటి చంద్రయ్య, ఆంజనేయులు తో పాటు తదితరులు పాల్గొన్నారు.