ఘనంగా గాయత్రోత్సవ్ 2 కే 26  ....

ఘనంగా గాయత్రోత్సవ్ 2 కే 26  ....

ప్రజాస్వరం,మేడ్చల్ :

మేడ్చల్ పట్టణంలోని గాయత్రి డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో గాయత్రోత్సవ్ 2కే 26 కార్యక్రమాన్ని పట్టణంలోని ఓం శివ సాయి ఫంక్షన్ హాల్ లో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ముందుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం నిర్వహించారు. కళాశాల యాజమాన్య సభ్యులు మాట్లాడుతూ గాయత్రీ కళాశాల లోని విద్యార్థుల భవిష్యత్తు కోసం ఉన్నత ప్రమాణాలతో విద్యను అందజేస్తున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల నుండి ఉన్నత విద్యకు వస్తున్న విద్యార్థులకు చేయూతనందిస్తూ బంగారు భవిష్యత్తుకు గాయత్రి కళాశాల బాసటగా నిలుస్తుందని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థుల నృత్య ప్రదర్శనలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. గత సంవత్సరం వరకు కళాశాలలో ఉత్తమ ర్యాంకులను సాధించిన విద్యార్థిని విద్యార్థులను జ్ఞాపకాలతో సత్కరించారు. విద్యార్థులకు నిర్వహించిన క్రీడా పోటీలలో విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల యాజమాన్య సభ్యులు శివ, గణేష్, శ్రీనివాస్ శర్మ, శ్రీనివాస్, కమలాకర్ రెడ్డి, దేవరాజ్, సత్యనారాయణ నరసింహారెడ్డి, అధ్యాపకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.