భారత రాజ్యాంగ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా గున్న సంధ్య...
By Prajaswaram
On
జవహర్ నగర్, అక్టోబర్ 10 (ప్రజాస్వరం):
భారత రాజ్యాంగ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలిగా గున్న సంధ్య నియమితులయ్యారు. శనివారం రాష్ట్ర అధ్యక్షుడు మహంకాళి భిక్షు ఆమెకు నియామక పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా గున్న సంధ్య మాట్లాడుతూ.. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ "బోధించు, సమీకరించు, పోరాడు" అనే ఆయన సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తానన్నారు.కుల రహిత సమాజం కోసం, సామాజిక న్యాయం కోసం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కృషి చేశారన్నారు. మహంకాళి భిక్షు చేస్తున్న జ్ఞానమాల కార్యక్రమాల స్ఫూర్తితో తాను కూడా అంబేద్కర్ ఐడియాలజీ కోసం పనిచేసేందుకు ముందుకు వచ్చినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో మంద ఆనంద్, అబ్బగోని నాగరాజు,మేడ స్వామి,గడిపే సునీల్,గడ్డం గిరి,జడల కిట్టు,నవీన్, సాలమ్మ తదితరులు పాల్గొన్నారు.
Latest News
10 Oct 2026 19:35:27
జాతీయ రహదారి దిగ్బంధం: వంటేరు ప్రతాప్ రెడ్డి వార్నింగ్... తూప్రాన్, అక్టోబర్ 05 (ప్రజాస్వరం) : ప్రతినిధి రైతులకు 12 గంటల వ్యవసాయ విద్యుత్ సరఫరా


