రైతులకు 12 గంటల వ్యవసాయ విద్యుత్ ఇవ్వాలి....

వంటేరు ప్రతాప్ రెడ్డి....

రైతులకు 12 గంటల వ్యవసాయ విద్యుత్ ఇవ్వాలి....

 జాతీయ రహదారి దిగ్బంధం: వంటేరు ప్రతాప్ రెడ్డి వార్నింగ్...

 

తూప్రాన్, అక్టోబర్ 05 (ప్రజాస్వరం) :

ప్రతినిధి

 రైతులకు 12 గంటల వ్యవసాయ విద్యుత్ సరఫరా చేయాలని గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి డిమాండ్ చేశారు.శనివారం తూప్రాన్ మండలం నాగులపల్లి శివారులో ఓ రైతు కు చెందిన ఎండిపోయిన వరి పొలాలను ఆయన పరిశీలించారు.ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ...కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే వరి పంటలు ఎండిపోతున్నాయని మండిపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులకు 24 గంటల ఉచిత కరెంటు ఇచ్చామని, కానీ ఈ ప్రభుత్వం కనీసం 9 గంటలు కూడా ఇవ్వడం లేదనిప్రతాప్ రెడ్డి విమర్శించారు.రెండు, మూడు రోజుల్లోగా విద్యుత్ సరఫరాను మెరుగుపరచాలని అధికారులను కోరారు. లేదంటే రైతులతో కలిసి జాతీయ రహదారి దిగ్బంధం చేస్తామని అయన హెచ్చరించారు. కొండ పొచ్చమ్మ ప్రాజెక్టు నుండి వ్యవసాయం కోసం నీరు వదిలితే చేతికి వచ్చిన పంటలు పండేవి అని బోరుబావులలో నీరు ఉన్నా కరెంట్ లేక పొలాలు ఎండిపోతున్నాయని ప్రతాప్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు, రైతులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.